/rtv/media/media_files/2026/03/26/sri-rama-navami-2026-03-26-19-04-44.jpg)
sri Rama navami
ఖమ్మంలోని భద్రాచలంలో సీతారాముల కళ్యాణాన్ని శ్రీరామ నవమి రోజున ఘనంగా నిర్వహిస్తారు. భారీ సంఖ్యలో భక్తులు ఈ కళ్యాణాన్ని చూడాలని అనుకుంటారు. ఆ రాముల వారి గోటి తలంబ్రాలను ఇంట్లో ఉంచుకోవాలని భావిస్తారు. అయితే అందరికి ఆ స్వామి వారి కళ్యాణం చూడటం కుదరదు. అలాంటి వారు ఈ గోటి తలంబ్రాలను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకోవచ్చు. రాముల వారి కళ్యాణం తలంబ్రాలను ఇంట్లో ఉంచుకోవడం వల్ల సుఖశాంతులతో పాటు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తులు నమ్ముతారు. అయితే ఇంటి నుంచే ఈజీగా ఈ తలంబ్రాలను ఆర్డర్ చేసుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం.
ఇది కూడా చూడండి: హిందూ మహాసముద్రంలో చైనా ‘సైలెంట్’ వార్.. భారత్ తీరంలో డ్రాగన్ నౌకల నిఘా!
ఆన్‌లైన్ బుకింగ్ ప్రక్రియ
భక్తులు తమ మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా సులభంగా తలంబ్రాలను బుక్ చేసుకోవచ్చు. ముందుగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. హోమ్ పేజీలో కనిపించే 'Mutyala Talambralu' అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఓపెన్ అయ్యే ఫారమ్‌లో భక్తుని పేరు, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి, తలంబ్రాలు చేరాల్సిన పూర్తి చిరునామా తప్పులు లేకుండా నమోదు చేయాలి. ఒక్కో తలంబ్రాల ప్యాకెట్ ధర కేవలం రూ.60 ఉంటుంది.
ఇది కూడా చూడండి: Vande Bharat Express: పెరుగులో పురుగులు.. ఇండియన్ రైల్వేస్‌కు భారీ జరిమానా
మీకు ఎన్ని ప్యాకెట్లు కావాలో ఆ సంఖ్యను అందులో ఎంటర్ చేయాలి. వివరాలన్నీ నమోదు చేసిన తర్వాత 'Make Payment' ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అక్కడ మీరు నెట్ బ్యాంకింగ్, డెబిట్/క్రెడిట్ కార్డ్, UPI లేదా క్యూఆర్ కోడ్ ద్వారా డబ్బులు చెల్లించవచ్చు. పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత మీకు ఒక డిజిటల్ రశీదు వస్తుంది. దానిని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇలా మీరు బుక్ చేసుకున్న కొన్ని రోజుల్లోనే పోస్టల్ శాఖ వారు తలంబ్రాలను మీ ఇంటికి చేరుస్తారు. వీటిని ఇంట్లో ఉంచడం వల్ల సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
ఇది కూడా చూడండి: ఇండియాకు ఇరాన్ గుడ్‌న్యూస్.. 5 మిత్రదేశాలకు హర్మూజ్ జలసంధి పర్మిషన్
గోటీ తలంబ్రాలను ఎంతో నియమ నిష్టలతో తయారు చేస్తారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని విశ్వనాథపల్లి గ్రామ భక్తులు గత మూడు దశాబ్దాలుగా ఈ పవిత్ర కార్యాన్ని నిర్వహిస్తున్నారు. వీరితో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు, మహిళలు, వృద్ధులు స్వచ్ఛందంగా తరలివచ్చి ఈ సేవలో పాల్గొంటారు. సాధారణంగా ధాన్యాన్ని మిల్లులో వేసి బియ్యాన్ని వేరు చేస్తారు. కానీ.. రాముల వారి కళ్యాణం కోసం భక్తులు ఒక్కో ధాన్యం గింజను పట్టుకుని తమ గోటితో నొక్కి లోపల ఉన్న బియ్యం గింజ విరగకుండా బయటకు తీస్తారు. ఇలా చేయడం వల్ల బియ్యం గింజలు పూర్తిగా ఉండటంతో పాటు నిగనిగలాడుతూ ముత్యాల వలె కనిపిస్తాయి. అందుకే వీటిని 'ముత్యాల తలంబ్రాలు' అని కూడా అంటారు. ఈ తలంబ్రాలను ఎంతో నియమబద్ధంగా తయారు చేస్తారు.
ఇది కూడా చూడండి: యుద్ధరంగంలోకి భారత్.. 'ఆపరేషన్ ఊర్జా సురక్ష' ప్రారంభించిన ఇండియన్ నేవీ
Follow Us