/rtv/media/media_files/2025/03/03/oCsrzQY2gX5Rm2TwbqXw.jpg)
Heatwave
వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది మార్చి నంచే ఎండలు దంచికొట్టనున్నాయని హెచ్చరించింది. అంతేకాదు గతంలో ఎప్పుడూ లేని విధంగా హీట్‌వేవ్స్ వస్తాయని అంచనా వేస్తోంది. మార్చిలోనే ఇలాంటి పరిస్థితులు ఉంటే ఇక ఏప్రిల్, మే నెలలో ఎండలు ప్రభావం మరింత తీవ్రంగా ఉంటాయనే ఆందోళన నెలకొంది. ఈ క్రమంలోనే వేసవిలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే వడదెబ్బ తగలడం, ఇతర అనారోగ్య సమస్యలకు గురవుతారని హెచ్చరిస్తున్నారు.
Also Read: నడిరోడ్డుపై వధువు కిడ్నాప్.. ఊరేగింపు మధ్యలో ఎలా ఎత్తుకెళ్లారంటే?
నిపుణుల సూచనల ప్రకారం.. వేసవి కాలంలో డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండడానికి దాహం వేయకున్నా కూడా తరచుగా నీటిని తాగాలి. రోజులో ఒకటి లేదా రెండుసార్లు ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ORS)ని వాడాలి. నిమ్మరసం, మజ్జిగ, పండ్ల రసాలు తాగాలి. అలాగే ఇంట్లో తయారుచేసిన ఇతర పానీయాలతో కొద్దిగా ఉప్పు కలిపి తీసుకోవాలి.
Also Read: రోహిత్ శర్మపై బాడీ షేమింగ్ పోస్టు .. డిలీట్ చేసిన ముస్లిం మహిళా నేత!
బయటకు వెళ్లేటప్పుడు కాకుండా ఇంట్లో ఉన్నప్పుడు వదులుగా ఉండే కాటన్ దుస్తులు వేసుకోవాలి. తప్పనిసరిగా బయటకి వెళ్లాల్సి వస్తే గొడుగు, టవల్, టోపి వంటివి వాడటం మంచింది. ఉదయం వేళ కిటికీలు, కర్టెన్‌లను మూసేయాలి. సాయంకాలం చల్లని గాలి లోపలికి వచ్చేలా కిటికీలు తెరిచి ఉంచాలి. చిన్నారులు, గర్భిణులు, వృద్ధులు, గుండె జబ్బులతో బాధపడేవారు వేడి వాతావరణంలో బయటికి వెళ్తే.. వడదెబ్బ తగిలే ఛాన్స్ ఉంటుంది. వీళ్లు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా డీహైడ్రేషన్‌కు గురికాకుండా చూసుకోవాలి. ఎండల వల్ల వికారం, వాంతులు, తలనొప్పి, విపరీతమైన దాహం, మూత్ర విసర్జన తగ్గడం, శ్వాస వేగంగా తీసుకోవడం, గుండే ఎక్కువగా కొట్టుకోవడం లాంటి లక్షణాలు కనిపిస్తే సమీపంలో వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: ట్రంప్ పిలిస్తే మళ్లీ వెళ్లి మాట్లాడుతా.. జెలెన్ స్కీ సంచలన వ్యాఖ్యలు
Also Read: ''గంగా జలాలు దానికి పనికిరావు''.. ఆర్థిక సర్వేలో సంచలన విషయాలు