Sri Rama Navami 2026: రామయ్య కల్యాణానికి ఏపీ సారె..  కోవాతో 108 రకాల ప్రత్యేకమైన పదార్థాలు

శ్రీరామ నవమి వేడుకలను భద్రాచలంలో ఘనంగా నిర్వహించనున్నారు. అయితే రాముల వారి కళ్యాణం కోసం అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం, బాపట్ల జిల్లా చీరాల ప్రాంతాల నుంచి కోవాతో సారె తయారు చేశారు.

New Update
Sri Rama navami

Sri Rama navami

శ్రీరామ నవమి వేడుకలను భద్రాచలంలో ఘనంగా నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా రాముల వారి కళ్యాణం చూడటానికి వెళ్తారు. అయితే రాముల వారి కళ్యాణం కోసం అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం, బాపట్ల జిల్లా చీరాల ప్రాంతాల నుంచి కోవాతో సారె తయారు చేశారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం గోదావరి నది పాయ - ఆక్విడక్ట్ వద్ద వెలసిన శ్రీ పట్టాభిరామ మందిరం నుంచి గత 17 ఏళ్లుగా శ్రీ సీతారామ కళ్యాణం సందర్భంగా 'కంత సారె'ను సమర్పిస్తున్నారు. భీమరాజు, సత్యవాణి దంపతులు శ్రీరాముడి తరపున సీతమ్మ వారికి ఈ సారెను అందజేస్తారు.

ఇది కూడా చూడండి: హిందూ మహాసముద్రంలో చైనా ‘సైలెంట్’ వార్.. భారత్ తీరంలో డ్రాగన్ నౌకల నిఘా!

ఇది కూడా చూడండి: యుద్ధరంగంలోకి భారత్.. 'ఆపరేషన్ ఊర్జా సురక్ష' ప్రారంభించిన ఇండియన్ నేవీ

నిష్టతో స్వామి వారి ప్రసాదం..

ఈ ప్రసాదాన్ని ఎంతో నిష్టతో తయారు చేస్తారు. సుమారుగా 200 లీటర్ల పాలను ఉపయోగించి దాదాపు 15 రోజుల పాటు భక్తిశ్రద్ధలతో ఈ 'కంత సారె'ను సిద్ధం చేస్తారు. ఇందులో భాగంగా మొత్తం 108 రకాల పాలకోవా ఆకృతులను తయారు చేయడం విశేషం. సీతమ్మ వారికి కోవాతో చేసిన పట్టుచీర, రాముల వారికి పట్టు పంచె, వివిధ రకాల పండ్లు, పిండి పదార్థాలను సైతం కోవాతోనే కళాత్మకంగా రూపొందిస్తారు. కళ్యాణం ముగిసిన తర్వాత ఈ పవిత్ర ప్రసాదాన్ని భక్తులందరికీ పంపిణీ చేస్తారు.

ఇది కూడా చూడండి: Vande Bharat Express: పెరుగులో పురుగులు.. ఇండియన్ రైల్వేస్‌కు భారీ జరిమానా

బాపట్ల జిల్లా చీరాలలో భద్రాచల సీతారాముల కళ్యాణం కోసం శ్రీ రఘురామ్ భక్తి సేవా సమితి ఆధ్వర్యంలో తలంబ్రాల తయారీ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. భద్రాద్రి రామయ్య కళ్యాణానికి ఇక్కడి నుండి తలంబ్రాలు పంపడం ఒక ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా భక్తులు కొన్ని వారాల పాటు ఎంతో నిష్టతో యంత్రాల సహాయం లేకుండా కేవలం చేతితో వలిచిన ధాన్యపు గింజలను సిద్ధం చేశారు. కేవలం తలంబ్రాలే కాకుండా కళ్యాణ వేడుకలో వాడే పసుపు, వస్త్రాలు, ముత్యాల హారాన్ని కూడా చీరాల నుండే భద్రాచలానికి పంపుతున్నారు. 

ఇది కూడా చూడండి: ఇండియాకు ఇరాన్ గుడ్‌న్యూస్.. 5 మిత్రదేశాలకు హర్మూజ్ జలసంధి పర్మిషన్

 

Advertisment
తాజా కథనాలు