Sri Rama Navami 2026: శ్రీరాముడికి ఇష్టమైన నైవేద్యాలు.. వీటితో పూజిస్తే కోరికలు నెరవేరడం ఖాయం

శ్రీరామ నవమికి ముఖ్యంగా పెట్టాల్సిన నైవేద్యం పానకం. ఇందులో బెల్లం, మిరియాలు, యాలకులు వేసి తయారు చేశారు. ఈ పానకం సూర్య, అగ్ని తత్వాలకు సంకేతంగా చెప్పుకుంటారు. వడపప్పు, చలిమిడిని నైవేద్యంగా పెడతారు. ఇవి శరీరంలోని వేడిని తగ్గించి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి.

author-image
By Kusuma
New Update
Sri rama navami

Sri rama navami

శ్రీరామ నవమిని భక్తులు ఎంతో పవిత్రంగా పూజిస్తారు. ముఖ్యంగా రాముడికి ఇష్టమైన నైవేద్యాలు పెడుతూ.. పూలతో పూజిస్తారు. ఇలా చేయడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు అంటున్నారు. అయితే రాముడికి ఇష్టమైన నైవేద్యాలు ఏంటి? ఏ సమయంలో పూజ చేసి పెట్టాలి? దీనివల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయో పూర్తి వివరాల్లో చూద్దాం.

ఇది కూడా చూడండి: హిందూ మహాసముద్రంలో చైనా ‘సైలెంట్’ వార్.. భారత్ తీరంలో డ్రాగన్ నౌకల నిఘా!

వీటిని నైవేద్యాలుగా పెడితే..

శ్రీరామ నవమికి ముఖ్యంగా పెట్టాల్సిన నైవేద్యం పానకం. ఇందులో బెల్లం, మిరియాలు, యాలకులు వేసి తయారు చేశారు. ఈ పానకం సూర్య, అగ్ని తత్వాలకు సంకేతంగా చెప్పుకుంటారు. అలాగే వడపప్పు, చలిమిడిని నైవేద్యంగా పెడతారు. ఇవి శరీరంలోని వేడిని తగ్గించి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. ఇక వనవాస కాలంలో రాముడు తిన్న కందమూలాలు, పండ్లు కూడా ఆయనకు ఎంతో ఇష్టం. వీటితో పాటు విష్ణు స్వరూపుడైన రాముడికి పరమాన్నం సమర్పించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని పండితులు అంటున్నారు. 

ఇది కూడా చూడండి: ఇండియాకు ఇరాన్ గుడ్‌న్యూస్.. 5 మిత్రదేశాలకు హర్మూజ్ జలసంధి పర్మిషన్

మానసిక ప్రశాంతత నెలకొంటుందని..

శ్రీరామ నవమి రోజున తులసి దళాలు ఎంతో ముఖ్యమైనవి. వీటితో సీతారాములను పూజిస్తే మానసిక ప్రశాంతతతో పాటు మోక్ష ప్రాప్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగే మల్లెలు, సంపంగితో సీతారాములను పూజిస్తే కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరగడంతో పాటు గృహంలో శాంతి నెలకొంటుంది. అలాగే ఎలాంటి సమస్యలు రావు. కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు అంటున్నారు.

పూజకు వీటితో పాటు ఎర్రటి తామరలను ఉపయోగించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగి ధన ప్రాప్తి కలుగుతుందని పండితులు అంటున్నారు. అయితే ఎప్పటి నుంచి తీరని సమస్యలు, అపజయాలు ఉంటే మాత్రం సుందరకాండ పారాయణం చేస్తే మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. భక్తి శ్రద్ధలతో పాటు నియమనిష్టతో నవమి రోజున పూజించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు అంటున్నారు.

ఇది కూడా చూడండి: Vande Bharat Express: పెరుగులో పురుగులు.. ఇండియన్ రైల్వేస్‌కు భారీ జరిమానా

Advertisment
తాజా కథనాలు