/rtv/media/media_files/2025/03/28/uAtxvdjizE7N0d7KAJ0J.jpg)
nitisinone mosquito Photograph: (nitisinone mosquito)
ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా 5 లక్షల మంది మలేరియా బారిన పడి చనిపోతున్నారు. దోమల కారణంగా వచ్చే ప్రాణాంతక వ్యాధులు డెంగ్యూ, మలేరియా ఇండియాలో కూడా అనేక మందిని బలితీసుకుంటున్నాయి. ముల్లుని ముల్లుతోనే తీయాలన్న రీతిలో శాస్త్రవేత్తలు మలేరియా దోమలను అంతం చేయడానికి ఓ ప్రయోగాన్ని చేశారు. మనిషి రక్తాన్ని పీల్చే దోమలకు ఈ రక్తంతోనే చెక్ పెట్టాలని శాస్త్రవేత్తలు ఓ రసాయనాన్ని కనిపెట్టారు.
Also read: మెట్రో ఎండీ NVS రెడ్డి ఔట్.. మరో 6700 మంది ఉద్యోగులు కూడా.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం!
Also Read : వరంగల్‌లో భయం భయం.. చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్
Scientists Experiment With Turning Human Blood
మనుషుల రక్తంలోకి నిటిసినోన్ ఔషధాన్ని ఎక్కిస్తే.. దోమల పాలిట విషంగా మారుతుందని శాస్త్రవేత్తలు అధ్యయనంలో తేల్చారు. అరుదైన జన్యు వ్యాధుల చికిత్స కోసం నిటిసినోన్‌ను వాడతారు. అయితే దీనివల్ల కలిగే సైడ్‌ఎఫెక్ట్స్ దోమలకు ప్రాణాంతకమని.. ఈ ఔషధాన్ని వాడుతున్న రోగులపై పరిశోధన చేసిన సైంటిస్టులు ఇటీవల కనుగొన్నారు. ఈ ఔషధం రోగుల జీవక్రియలకు దోహదం చేయగా.. ఆ రోగుల రక్తం తాగిన దోమల జీర్ణక్రియకు నష్టం కలిగిస్తాయి. నిటిసినోన్ ఔషధాన్ని వాడిన పేషెంట్లను కుట్టిన దోమలు 12 గంటల్లో చనిపోవడం సైంటిస్టులు గుర్తించారు. ఒక్కసారి మనిషి శరీరంలోకి నిటిసినోన్ ఎక్కిస్తే అది దీర్ఘకాలం పని చేస్తుంది. ఇది మనుషులకు, పర్యావరణానికి ఎలాంటి హాని చేయదని సైంటిస్టులు చెబుతున్నారు.
Also read: AIDS with drugs: కొంపముంచిన డ్రగ్స్ అలవాటు.. ఒకేసారి 10 మంది ఎయిడ్స్
Also Read : ఏప్రిల్ 1 నుంచి న్యూ రూల్స్.. కొత్త పన్ను శ్లాబులు, యూపీఐ, క్రెడిట్ కార్డులో మార్పులు
Lacing human blood with nitisinone can kill feeding mosquitoes within a day - a potential new weapon against malaria which still kills over 500,000 people a year. @lstmnews @AAcostaserranohttps://t.co/GvWgppKtT7 pic.twitter.com/pdDFv0SXUz
— ScienceAlert (@ScienceAlert) March 27, 2025
malaria treatment | world-malaria-day | healthy life style | daily-life-style | human-life-style | health | latest-telugu-news | today-news-in-telugu