/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/subja-seeds-benefits.jpg)
Sabja
సాధారణంగా కొందరి బాడీ వేడిచేస్తుంది. చలవ కోసం కొందరు సబ్జా, చియా సీడ్స్ వాటర్ తాగుతారు. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని అంటుంటారు. ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. అయితే ఇవి ఆరోగ్యానికి మంచిదే అయిన అధికంగా తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధికంగా సబ్జా గింజలను తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.
ఇది కూడా చూడండి: Horoscope Today: ఈ రోజు ఈ రాశి వారికి సొంత నిర్ణయాలు నష్టాన్ని తెచ్చిపెడతాయి.. జాగ్రత్త!
కడుపులో మంట వంటి సమస్యలు వస్తాయని..
ఇవే కాకుండా కడుపులో మంట, మలబద్ధకం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా ఇవి ఆరోగ్యానికి మంచివే. కానీ అధికంగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడతారు. బాడీ హైడ్రేట్‌గా ఉండాలని ఈ సబ్జా గింజలను తీసుకుంటారు. కానీ అధికంగా తీసుకుంటే.. డీహైడ్రేషన్‌కు గురి అవుతారని నిపుణులు అంటున్నారు.
ఇది కూడా చూడండి: Lalith Modi: లలిత్ మోదీకి వనువాటు పౌరసత్వం..ఎంతకు కొన్నారో తెలుసా?
మోతాదులో సబ్జా గింజలను తీసుకోవడం వల్ల బాడీకి చలవ చేస్తుంది. తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. వీటితో జుట్టు సంబంధిత సమస్యలను కూడా తగ్గిస్తుంది. మానసిక సమస్యలు ఉన్నవారికి సబ్జా సీడ్స్ బాగా ఉపయోగపడతాయి.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చూడండి: TG News: మహిళలపై సీఎం రేవంత్ వరాల జల్లు.. ఇందిరా మహిళాశక్తి మిషన్-2025 పాలసీ ప్రకటన!
ఇది కూడా చూడండి: Trolls on Jr NTR: ఎన్టీఆర్ యాడ్ పై గోరంగా ట్రోలింగ్..! వీడియో చూశారా?