TG Crime: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో విషాదం నెలకొంది. బుగ్గపాడు గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు చెరువులో శవమై లభ్యం అయ్యారు. మృతులు పంతంగి కృష్ణారావు (60), సీత(55) గా స్థానికులు గుర్తించారు. ఈ రోజు తెల్లవారు జామున పొలానికి వెళ్తున్న రైతులు గ్రామానికి శివారులోని రావి చెరువులో రెండు మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్థానికులు సహాయంతో బయటకు తీశారు. అనంతరం ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఇది కూడా చదవండి: బెల్లంలో పెరుగు కలిపి తింటే ఈ వ్యాధి పరార్
చెరువులోకి దూకి ఆత్మహత్య..
అయితే కృష్ణ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పిల్లలందరికీ వివాహాలు చేశారు. ఇటీవల ఆటో కూడా మరమ్మతులకు గురవటంతో కుటుంబ పోషణ కష్టంగా మారింది. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు తాళలేక భార్య, భర్త గ్రామ శివారులోని చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని మృతుల కుటుంబ సభ్యులు, స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: గుమ్మడికాయతో గుమ్మడికాయంత పొట్టైనా కరగాల్సిందే
అయితే మృతి చెందిన దంపతులు శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో రోడ్డుపై నడిచి వెళుతున్న దృశ్యం ఓ షాపు ఎదురుగా ఉన్న సీసీ టివిలో నమోదు అయింది. సీసీ టీవీ వీడియోల ఆధారంగా ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రుల మృతి చెందటంతో వారి పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఇది కూడా చదవండి: కాకరకాయ రసంతో ఆరు అద్భుత ప్రయోజనాలు
ఇది కూడా చదవండి: వంద కోట్ల క్లబ్ లో 'సంక్రాంతికి వస్తున్నాం'.. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్