Night Shifts: నైట్ షిఫ్ట్స్ చేస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త

నైట్ షిఫ్ట్‌లు చేయడం వల్ల గుండె పోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడంతో పాటు ఊబకాయం వంటి సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి నైట్ షిఫ్ట్‌లు చేయకుండా రాత్రి సమయంలో నిద్రపోండి.

New Update
Night Shift : నైట్‌ షిప్ట్‌లు ఎక్కువగా చేసేవారు ఇవి తింటే మంచిది

night shift

ఉద్యోగాలు, మొబైల్ వాడటం, సినిమాలు చూడటం వంటి వాటి వల్ల రాత్రి అసలు నిద్రపోరు. దీనివల్ల చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ రోజుల్లో చాలా మంది నైట్ షిఫ్ట్‌లు చేస్తున్నారు. కొందరు అయితే మరీ దారుణం.. అసలు రాత్రి పది నిమిషాలు కూడా కునుకు తీయరు. మరి పూర్తిగా నైట్ షిఫ్ట్‌లు చేయడం వల్ల ఆరోగ్యానికి కలిగే నష్టాలేంటో మరి ఈ స్టోరీలో చూద్దాం. 

ఇది కూడా చూడండి: Saif Ali Khan: సైఫ్‌పై దాడి జరిగేటప్పుడు నలుగురు మగ పనిమనుషులు అక్కడే.. వెలుగులోకి సంచలన నిజాలు

గుండె పోటు వచ్చే ప్రమాదం..

నైట్ షిఫ్ట్‌లు చేయడం వల్ల గుండె పోటు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నిద్ర లేకపోతే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఇది కాస్త తీవ్రం అయ్యి టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనిషికి నిద్ర అనేది చాలా ముఖ్యం. నిద్ర లేకపోతే మానసికంగా బాధపడతారు.

ఇది కూడా చూడండి: Health: చిన్న బెల్లం ముక్కతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో ..కానీ ఏ సమయంలో తినాలో తెలుసా!

జ్ఞాపకశక్తి పూర్తిగా తగ్గుతుంది. అలాగే రోగనిరోధక శక్తి తగ్గడంతో ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్ల బారిన పడతారు. నిద్ర తక్కువగా ఉంటే ఊబకాయం కూడా వస్తుంది. అలాగే లైంగికంగా ఆసక్తి తగ్గడం, మూడ్ స్వింగ్స్ వంటివి మారిపోతాయి. ముఖ్యంగా సంతాన సమస్యలు వస్తాయి. కాబట్టి నైట్‌ షిఫ్ట్‌లు చేసి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు.

ఇది కూడా చూడండి: Akkineni Akhil: అఖిల్ పెళ్ళి డేట్ ఫిక్స్.. ఆరోజు నుంచి ఘనంగా పెళ్లి వేడుకలు

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు