/rtv/media/media_files/0BpO1VfZveoayhb7NN2x.jpg)
Roti
ఆరోగ్యంగా ఉండాలని రాత్రిపూట కొందరు చపాతీలు తింటారు. ఇందులోని పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పొరపాటున రాత్రి పూట ఒక్కోసారి చపాతీలు మిగిలిపోతుంటాయి. తర్వాత రోజు ఉదయాన్నే కొందరు వీటిని తింటారు. మరికొందరు ఇలా రాత్రి చపాతీలను తినడం ఆరోగ్యానికి మంచిది కాదని అనుకుంటారు. అయితే రాత్రి మిగిలిపోయిన రొట్టేను ఉదయాన్నే తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చూడండి: Sankranthiki Vasthunam: వెంకీ మామ ఫ్యాన్స్ గెట్ రెడీ.. యూట్యూబ్ లో 'గోదారి గట్టు మీద' సాంగ్ ఫుల్ వీడియో
డయాబెటిస్ సమస్యల నుంచి విముక్తి
రాత్రి చేసిన రొట్టేను ఉదయాన్నే తినడం వల్ల బరువు తగ్గడంతో పాటు డయాబెటిస్ వంటి సమస్యల నుంచి విముక్తి పొందుతారని నిపుణులు అంటున్నారు. సద్దె రొట్టెను తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అయితే కొందరు రాత్రి రొట్టెను వేడి చేసి తింటారు. ఇలా మళ్లీ వేడి చేసి కాకుండా డైరెక్ట్‌గానే చపాతీలను తినడం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చూడండి: Pakistan PM : పరువు తీయొద్దు .. భారత్ పై గెలవండి..కప్ తీసుకురండి : పాక్ ప్రధాని
సద్దె రొట్టె తినడం వల్ల జీర్ణ సమస్యలు, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే రక్తపోటు నియంత్రణలో ఉండటంతో పాటు కండరాలు కూడా బలంగా పనిచేస్తాయి. వ్యాయామం చేసిన వారు ఈ సద్దె రొట్టెను తినడం వల్ల ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చూడండి: Mastan sai: టాలీవుడ్ To పాలిటిక్స్ ఎవరిని వదలని మస్తాన్ సాయి: టోటల్ లిస్ట్ ఆడియో వైరల్!
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.