/rtv/media/media_files/2025/01/16/0gjKS3WyE9JqoeqmLR1o.jpg)
Mung Bean Photograph: (Mung Bean)
చాలా మంది ఈ రోజుల్లో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి ముఖ్య కారణం పోషకాలు, విటమిన్లు లేని ఆహారాలు తీసుకోవడం వల్లనే అని నిపుణులు చెబుతున్నారు. పోషకాలు ఉండే ఫుడ్ కంటే ఫాస్ట్‌ఫుడ్స్ ఎక్కువగా తింటున్నారు. వీటిలో పోషకాలు లేకపోవడం వల్ల అనారోగ్య సమస్యలతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది సాయంత్రం సమయాల్లో స్నాక్స్‌గా నూడిల్స్ వంటివి తింటున్నారు. వీటికి బదులు పెసలను ఉడికించి తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.
ఇది కూడా చూడండి: Kareena Kapoor: భర్త పై దాడి.. స్పందించిన కరీనా కపూర్, ఏం చెప్పారంటే?
గుండె సమస్యలు రాకుండా..
పెసల్లో ఎక్కువగా విటమిన్ C, విటమిన్ K, ఐరన్, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇందులో ప్రొటీన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. గుండె సమస్యలు రాకుండా కాపాడతాయి. వీటిని సాయంత్రం సమయాల్లో ఉడికించి తినడం వల్ల కండరాలు బలంగా ఉంటాయి.
ఇది కూడా చూడండి: Saif Ali khan: సైఫ్ అలీ ఖాన్ హెల్త్ బులిటెన్ విడుదల.. డాక్టర్లు ఏం చెప్పారంటే
ముఖ్యంగా చిన్నపిల్లలకు వీటిని స్నాక్స్‌గా ఇవ్వడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. వారి ఎముకలు కూడా బలంగా తయారవుతాయి. అలాగే పెసలు పిల్లల మెదడును మెరుగుపరుస్తుంది. ఇందులోని ఫైబర్ జీర్ణ సమస్యలు రాకుండా కూడా చేస్తుంది. కాబట్టి డైలీ సాయంత్రం వీటిని ఉడికించి పిల్లలకు పెట్టడం అలవాటు చేసుకోండి.
ఇది కూడా చూడండి: Manchu Manoj: చంద్రగిరి పోలీస్ స్టేషన్ కు మంచు మనోజ్
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చూడండి: Alcohol: ఆల్కహాల్ తాగడం వల్ల వచ్చే క్యాన్సర్‌లు..డేంజర్‌లో మీ ఆరోగ్యం