/rtv/media/media_files/2025/02/20/Fada09ctTP5ece0SQzNS.jpg)
Maha Sivarathri Photograph: (Maha Sivarathri )
Mahashivratri 2025: ఏడాదికి ఒకసారి పవిత్రమైన మహా శివరాత్రి వస్తుంది. అయితే ఈ ఏడాది వచ్చే మహా శివరాత్రి చాలా స్పెషల్. దాదాపుగా 149 ఏళ్ల తర్వాత ఈ మహా శివరాత్రి వస్తోంది. సూర్యుడు, బుధుడు, శని గ్రహాలు శివరాత్రి రోజున కుంభ రాశిలో ఉంటాయి. ఇన్నేళ్ల తర్వాత ఈ మూడు పవర్‌ఫుల్ గ్రహాలు ఇందులో ఉండటంతో పాటు దీన్ని స్పెషల్ మహా శివరాత్రిగా చెప్పుకుంటారు.
ఇది కూడా చూడండి: Kamal Hasan: ఆలస్యంగా రావడం వల్లే ఓటమి..20 ఏళ్ల ముందే వచ్చి ఉంటే కథ వేరేలా ఉండేది!
అరుదైన కలయిక వల్ల..
ఈ అరుదైన గ్రహ కలయిక సమయంలో శివుడిని పూజిస్తే కోరిన కోరికలు అన్ని కూడా నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. ఇలాంటి అరుదైన కలయిక 1965లో జరిగింది. మళ్లీ ఫిబ్రవరి 26వ తేదీన మహా శివరాత్రి రోజున జరగనుంది. సూర్యుడు, బుధుడు, శని యోగం వల్ల మంచి జరగుతుంది. ఇంతటి స్పెషల్ మహా శివరాత్రి నాడు భక్తులు శివున్ని పూజించడం వల్ల అంతా మంచే జరుగుతుందని పండితులు చెబుతున్నారు.
ఇది కూడా చూడండి:Horoscope: ఈరోజు ఈ రాశివారు డబ్బు నష్టపోయే అవకాశాలున్నాయి..జాగ్రత్త!
ఈ మహాశివరాత్రి నాడు, శుక్రుడు ఉచ్ఛ రాశి అయిన మీన రాశిలో ఉంటాడు. దీంతో పాటు రాహువు కూడా ఉంటాడు. ఇదే కాకుండా సూర్యుడు, శని కుంభ రాశిలో ఉండటంతో పాటు శుక్రుడు తన శిష్యుడు రాహువుతో మీన రాశిలో ఉంటాడు. వీటిన్నింటి కలయిక కూడా దాదాపు 149 ఏళ్ల తర్వాత జరుగుతోంది. ఇలాంటి అద్భుతమైన రోజున శివుడిని భక్తితో పూజించి, అభిషేకం చేస్తే తప్పకుండా కోరిన కోరికలు అన్ని కూడా నెరవేరుతాయి.
ఇది కూడా చూడండి: MK Stalin:దేని మీద రాళ్లు రువ్వుతున్నారో గమనించుకోండంటూ స్టాలిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. పూర్తి వివరాలు కోసం దీనికి సంబంధించిన పండితులను సంప్రదించగలరు.
ఇది కూడా చూడండి: ఇంటర్ విద్యార్థులకు బిగ్ షాక్.. సెలవులు కుదింపు