Water Fasting: వాటర్ ఫాస్టింగ్‌తో త్వరగా బరువు తగ్గొచ్చా..?

నీరు తాగడం మంచిదే కానీ పరిమితికి మించి నీరు తాగడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. బరువు తగ్గాలంటే గోరువెచ్చని నీటిలో సోంపు, జీలకర్ర, తేనె, పసుపు వంటి మూలికలు, మసాలా దినుసులు కలుపుకుంటే బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు.

New Update
Water Fasting

Water Fasting

Water Fasting : జీవానికి నీరు చాలా అవసరం. తగినంత నీరు తాగడం కూడా ఆరోగ్యానికి ముఖ్యం. ప్రతిరోజూ 3 నుంచి 5 లీటర్ల నీరు తాగితే సర్వ రోగాలు దూరం అవుతాయని, శరీరాన్ని హైడ్రెట్‌ కాకుండా చేస్తుందని నిపుణులు చెబుతూ ఉంటారు. అయితే తాజాగా చేసిన సర్వేలో నీరు ఎక్కువగా తాగితే బరువు తగ్గుతారని వెల్లడైంది.  కొందరు దీనిని వాస్తవం అనుకుంటే మరికొందరూ అపోహ అంటున్నారు. సరైన మోతాదులో నీరు తాగడం వల్ల బరువు తగ్గవచ్చు. వేడి నీళ్ళు తాగడం వల్ల బరువు తగ్గవచ్చని కొందరు చెబుతున్నారు. అయితే ఇది నిజంగా నిజమా లేక భ్రమా? నిజంగా నీరు తాగితే బరువు తగ్గుతారో లేదో.. కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో చూద్దాం.

Also Read :  ఇంత అందగా ఉందేంటి.. రాశీ ఖన్నా దీపావళి మెరుపులు

బరువు తగ్గడానికి  ఎంత నీరు తాగాలి:

ప్రస్తుతం బరువు పెరగడం వల్ల అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు.  బరువు తగ్గడానికి  యోగా, వ్యాయమం, ఫుట్‌ డైట్‌ ప్రతిదీ చేస్తూ ఉంటారు. కానీ ఇంత కష్టపడిన తర్వాత కూడా కొంచెం తేడా లేకపోవటం వలన చాలామంది ఆందోళన చెబుతుంటారు.  ఆ సమయంలో కఠినమైన ఆహార నియమాలు కూడా పాటించి బరువు తగ్గుతారు. అయితే  వాటర్ ఫాస్టింగ్ చేయడం వల్ల కూడా వేగంగా బరువు తగ్గుతారు. ఎక్కువ నీరు తాగడం వల్ల త్వరగా బరువు తగ్గుతుందని నమ్ముతారు. త్వరగా బరువు తగ్గడానికి.. ఖచ్చితంగా ఎక్కువ నీరు తాగాలి.  

ఇది కూడా చదవండి: డెలివరీ తర్వాత మహిళలు ఇలా చేశారంటే డిప్రెషన్‌లోకి వెళ్తారు

నీరు తాగితే బరువు తగ్గుతారు అనేదానిల్లో నిజం లేదు. కేవలం నీరు తాగడం వల్ల బరువు తగ్గలేరు కానీ శరీరంలో ఇతర లోపాలు తలెత్తుతాయి. నీరు తాగడం వల్ల బరువు తగ్గదు, కానీ గోరువెచ్చని నీటిలో కొన్ని మూలికలు, మసాలా దినుసులు కలుపుకుంటే బరువు తగ్గవచ్చు. సోపు, ఆకుకూరలు, జీలకర్ర, తేనె, పసుపు మొదలైనవి. నీరు తాగడం మంచిదే కానీ పరిమితికి మించి నీరు తాగడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. సాధారణంగా శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి నీరు అవసరం. మనం ఎలాంటి నీరు తాగుతున్నాం, ఎంత మేలు చేస్తుంది..? ఒక గ్లాసు నీళ్లకు బదులు పుచ్చకాయ తింటే శరీరం హైడ్రేట్ అవుతుంది. అదేవిధంగా.. సలాడ్, దోసకాయ, టొమాటో మొదలైన వాటిలో కూడా చాలా నీరు ఉంటుంది. వీటిని తీసుకోవడం ద్వారా మీ శరీరంలో నీటి అవసరాన్ని కూడా తీర్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Also Read :  అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న 'విశ్వం'.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: పసుపు బట్టలతో వధూవరులను ఎందుకు ఒంటరిగా వదలరు?

Advertisment
Advertisment
తాజా కథనాలు