Maha Shivratri 2025: మొదటి సారి ఉపవాసం చేసేవారు పొరపాటున కూడా వీటిని ముట్టుకోవద్దు!

ఈ ఏడాది ఫిబ్రవరి 26న మహాశివరాత్రి జరుపుకోనున్నారు. అయితే మహాశివరాత్రి ఉపవాసం చేసేవారు పొరపాటున కూడా వీటిని తినకూడదు. ఉప్పు,  నల్ల ఉప్పు, వెల్లుల్లి, ఉల్లిపాయ, ముల్లంగి, క్యాబేజీ వంటి వాసనగల కూరగాయలను తీసుకోరాదు.

New Update
Maha Shivratri 2025

Maha Shivratri 2025

Maha Shivratri 2025: మరో ఆరు రోజుల్లో మహాశివరాత్రి(Mahasivaratri) వస్తోంది. ఫాల్గుణ మాసంలోని చతుర్దశి నాడు వచ్చే  మహాశివరాత్రి రోజు ఉపవాసం పాటిస్తారు. ఈ ప్రత్యేకమైన రోజున భోలే నాథుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఉపవాసం, పూజలు చేస్తారు. కొంతమంది నిర్జలి ఉపవాసం పాటిస్తే మరికొందరు ఫల ఉపవాసం పాటిస్తారు.  అయితే ఉపవాసం పాటించడానికి అనేక నియమాలు ఉంటాయి. వాటిలో ముఖ్యంగా  కొన్ని విషయాలను గుర్తించుకోవాలి. ఉపవాసం రోజున పొరపాటున కూడా తినకూడని ఆహార పదార్థాలు ఏంటో ఇక్కడ తెలుసుకోండి. మొదటిసారి మహాశివరాత్రి ఉపవాసం చేస్తుంటే, పొరపాటున కూడా వీటిని తినకూడదు. 

Also Read: AR Rahman: నోరు తెరిస్తే ఏమౌతుందో తెలిసిందా.. యూట్యూబర్ అల్లాబాడియాకు రెహ్మాన్ చురకలు!

తినకూడని ఆహారాలు 

  • తెల్ల ఉప్పు,  నల్ల ఉప్పు
  • వెల్లుల్లి, ఉల్లిపాయ
  • కంది, శనగ, రాజ్మా, మసూర్ వంటి ఏ రకమైన పప్పు ధాన్యాలనైనా తినకూడదు.
  • గోధుమ, బియ్యం, జొన్న, మొక్కజొన్న వంటి తృణధాన్యాలు
  • ఉపవాస సమయంలో ముల్లంగి, క్యాబేజీ వంటి ఘాటైన వాసనగల కూరగాయలను కూడా తినకూడదు.
  • నూనెలో వేయించిన పదార్థాలను కూడా తినకూడదు. వీటితో పాటు గుడ్డు, మాంసం
  • మద్యం, పొగాకు, గుట్కా, పాన్, తమలపాకు

Also Read: Kiccha Sudeep: హైదరాబాద్ మెట్రోలో హీరో కిచ్చా సుదీప్.. అక్కడ ఏం చేశారో చూడండి?

 మీరు వీటిని తినవచ్చు

  • పండ్లు , చిలగడదుంపలు వంటివి తినొచ్చు 

ఉపవాసం ఉన్నప్పుడు ఒకసారి మాత్రమే తినే వారు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.  ఒకసారి ఆహారం తింటే, రాతి ఉప్పుతో చేసిన వాటిని మాత్రమే తినాలి. అలాగే వెల్లుల్లి,  ఉల్లిపాయలు లేకుండా తయారు చేయాలి.

 Also Read: Aaryan Shukla: 14ఏళ్ల మహారాష్ట్ర కుర్రాడు.. ఒకేరోజు 6 గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్స్ ఎలా క్రియేట్ చేశాడంటే..?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు