Plants: ఇంటిలో చిన్న తోటను సృష్టించడం వలన అందం పెరగడమే కాదు మనకు మనశ్శాంతి, ఆరోగ్యకరమైన వాతావరణం కూడా లభిస్తుంది. అయితే మొక్కలు నాటడమే కాకుండా వాటిని కాపాడుకోవడంలోనూ మన బాధ్యత ఉంటుంది. మొక్కలకు హాని కలిగించే తెగుళ్లలో మీలీబగ్స్ చాలా ముఖ్యమైనవి. ఇవి చిన్న తెల్లటి పిండిలా కనిపించే పురుగులు. మొక్కల కాండం, ఆకులపై కనిపిస్తూ వాటి జీవరసాన్ని పీలుస్తూ ఉంటాయి. దీనివల్ల మొక్కలు బలహీనమవుతాయి.
మందులు అవసరం లేదు:
ఆకులు పసుపు రంగులోకి మారి, ఎండిపోతూ చివరికి మొక్క నశిస్తుంది. ఇలాంటి కీటకాల నుంచి మొక్కలను కాపాడేందుకు ఖరీదైన క్రిమిసంహారక మందులు అవసరం లేదు. కేవలం రూపాయి విలువైన షాంపూ పౌచ్‌తోనే దీన్ని సమర్థవంతంగా నివారించవచ్చు. ఒక లీటరు నీటిలో రెండు మిల్లీ లీటర్ల షాంపూను కలిపి తయారు చేసే ఈ ద్రావణాన్ని స్ప్రే బాటిల్‌లో పెట్టి మొక్కలపై చల్లితే మీలీబగ్స్ తగ్గుతాయి. కానీ దీన్ని సూర్యరశ్మి ఉన్న సమయంలో కాకుండా సాయంత్రం వేళల్లో పిచికారీ చేయాలి. మొదటిసారి చేయగానే ఫలితం రాకపోవచ్చు. వారానికి మూడుసార్లు పిచికారీ చేస్తే మెరుగైన ఫలితాన్ని పొందవచ్చు.
ఇది కూడా చదవండి: పండ్లను చూసే తియ్యగా ఉన్నాయో లేదో చెప్పొచ్చు
దీంతో పాటు వేపనూనె కూడా ఒక మంచి సహజ పరిష్కారం. వేప నూనెను నీటిలో కలిపి పిచికారీ చేస్తే మీలీబగ్స్ నివారణకు తోడ్పడుతుంది. అంతేకాకుండా సేఫర్ సబ్బు లేదా సాదా వాషింగ్ సొప్పుతో తయారైన ద్రావణాలను ఉపయోగించవచ్చు. కొన్ని సందర్భాల్లో మీలీబగ్ తీవ్రత అధికంగా ఉంటే ప్రభావిత ఆకులను తొలగించడం ఉత్తమమైన చర్య. ఇలా ఇంట్లో చిన్న ప్రయత్నాలతోనే మొక్కలను కాపాడుకోవచ్చు. సహజ పద్ధతుల్లో క్రిమిసంహారక చర్యలు తీసుకోవడం వల్ల మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.
ఇది కూడా చదవండి: క్యాన్సర్‌ను తరిమికొట్టే అద్భుతమైన ఆహారాలు
( home-tips | home tips in telugu | latest-news | bedroom-plants | coconut-plants | Green Power Plants | houseplants)