/rtv/media/media_files/2026/02/24/fake-milk-2026-02-24-12-04-08.jpg)
రాజమండ్రి(rajamundry) లో ఇటీవల జరిగిన కల్తీ పాలు(Fake Milk) ఘటన అందరినీ కలచివేసింది. ఒకే వ్యక్తి సరఫరా చేసిన పాలు తాగి ఏకంగా నలుగురు ప్రాణాలు కోల్పోవడం, పలువురు కిడ్నీ సమస్యలతో ఆసుపత్రి పాలవ్వడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో జనాలు పాలు తాగాలంటేనే భయపడిపోతున్నారు. ఈ క్రమంలో మనం ప్రతిరోజూ తాగే పాలు అసలు స్వచ్ఛమైనవేనా? వాటిని ఇంట్లోనే ఎలా పరీక్షించుకోవాలి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
మనం రోజూ తాగే ఒక గ్లాసు పాలు ఆరోగ్యాన్ని ఇస్తాయని నమ్ముతాం. కానీ రాజమండ్రిలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ ఘటనలు చూస్తుంటే పాలంటేనే భయం వేస్తోంది. మాల్టోడెక్స్ట్రిన్, యూరియా, డిటర్జెంట్ వంటి ప్రమాదకరమైన పదార్థాలతో పాలను కల్తీ చేసి అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు కొందరు కేటుగాళ్లు. ఈ కల్తీ పాలు తాగితే ముఖ్యంగా కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంది.
పాలలో నీళ్లు కలిపారో లేదో తెలుసుకోవడం చాలా సులభం. ముందుగా ఒక నునుపైన ప్లేటును లేదా అద్దాన్ని కొంచెం ఏటవాలుగా పెట్టండి. దానిపై ఒక చుక్క పాలు వేయండి. పాలు మెల్లగా జారుతూ.. వెనుక తెల్లటి గీత లాగా కనిపిస్తే అవి నిజమైన పాలు. అలా కాకుండా పాలు వేగంగా జారిపోతూ, వెనుక ఎలాంటి గుర్తు లేకపోతే అందులో నీళ్లు కలిపారని అర్థం.
పాలు తెల్లగా, చిక్కగా కనిపించేందుకు సోపు పొడిని కలుపుతుంటారు. ఒక గ్లాసులో కొంచెం పాలు, సమానంగా నీళ్లు పోయండి. వాటిని బాగా కలిపి ఊపండి. పాలు స్వచ్ఛమైనవైతే పైన పలచటి నురగ వస్తుంది. ఒకవేళ గ్లాసు నిండా మందపాటి నురగ వచ్చి, చాలా సేపు అలాగే ఉంటే అందులో ఖచ్చితంగా డిటర్జెంట్ కలిసినట్లే.
Also Read : 5ఏళ్లుగా మహిళ కడుపులో కత్తెర.. ఆపరేషన్ చేసిన డాక్టర్ షాకింగ్ సమాధానం
పాలు నీలం రంగులోకి మారితే
అంతేకాకుండా పాలు చిక్కగా ఉండటం కోసం బియ్యం పిండి లేదా మైదా కలుపుతుంటారు. కొంచెం పాలు తీసుకుని అందులో 2 లేదా 3 చుక్కల అయోడిన్ ద్రావణం వేయండి. పాలు నీలం రంగులోకి మారితే అందులో పిండి పదార్థం ఉందని గుర్తించాలి. రంగు మారకపోతే అవి స్వచ్ఛమైనవి.
యూరియా కలిపిన పాలు తాగితే కిడ్నీలు త్వరగా పాడవుతాయి. ఒక స్పూన్ పాలలో అర స్పూన్ సోయాబీన్ పొడి కలపండి. 5 నిమిషాల తర్వాత అందులో ఎర్ర లిట్మస్ పేపర్‌ను ఉంచండి. ఆ పేపర్ నీలం రంగులోకి మారితే ఆ పాలల్లో యూరియా ఉన్నట్లు లెక్క. ఇక స్వచ్ఛమైన పాలు రుచికి కొంచెం తియ్యగా ఉంటాయి. కల్తీ పాలు చేదుగా లేదా సోపు వాసనతో ఉంటాయి.
Also Read : మహాశివరాత్రి రోజు ఇలా చేస్తే అన్ని సమస్యలు మటాష్..!
Follow Us