/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-26-1-jpg.webp)
horoscope
మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మంచి ప్రణాళికతో అన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారంలో రాబడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో విందువినోదాలలో పాల్గొంటారు.
Also Read: Karnataka: నటి రన్యారావు కేసులో కీలక మలుపు..సీబీఐ కేసు
వృషభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. నూతన ఆదాయ వనరులు ఏర్పడతాయి. ఓ సంఘటన విచారం కలిగిస్తుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.
Also Read: Lalith Modi: లలిత్ మోదీకి వనువాటు పౌరసత్వం..ఎంతకు కొన్నారో తెలుసా?
మిథునరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాల వల్ల శ్రమ పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. సానుకూల ఆలోచనలతో ఉంటే మంచిది. బంధుమిత్రులతో అపార్థాలు ఏర్పడే అవకాశముంది.
కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సానుకూల దృక్పథంతో పనిచేసి విజయాలు సాధిస్తారు. సమాజంలో పేరొందిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ ప్రతిభకు ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు.
సింహరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో, ఆర్థిక అంశాలలో మీ శ్రమ ఫలిస్తుంది. కోరుకున్న విజయాలు అందుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో ఆర్థిక లాభాలు ఉంటాయి. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. వివాదాలకు దూరంగా ఉంటే మంచిది.
కన్యారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబంతో బంధం బలోపేతం అవుతుంది. వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశాలు అందుకుంటారు. ముఖ్య వ్యవహారాల్లో పెద్దల సలహాలు మేలు చేస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక వార్త విచారం కలిగిస్తుంది.
తులారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కీలక వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. అందరినీ కలుపుకొని పోవడం ఉత్తమం. కుటుంబ సభ్యులతో విబేధాలు బాధించవచ్చు. పని ప్రదేశం వద్ద పరిస్థితి అంత అనుకూలంగా ఉండదు. అవమానకర పరిస్థితులు ఏర్పడవచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకోండి.
వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు తమ రంగాల్లో శుభవార్తలు వినే అవకాశాలు కనపడుతున్నాయి. దైవబలంతో దురదృష్ట పరిస్థితుల నుంచి బయటపడతారు. నూతన వస్తువాహనాలు కొంటారు. వృథా ఖర్చులు తగ్గించుకుంటే మంచిది.
ధనుస్సురాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. లక్ష్యసాధన కోసం కృషి చేస్తారు. మనోధైర్యంతో పనిచేస్తే సత్ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆదాయం పెరుగుతుంది.
మకరరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు చికాకు కలిగిస్తాయి. మనోబలం తగ్గకుండా చూసుకోండి. రక్తసంబంధీకులతో పంతాలకు పోవద్దు. సహనంతో ఉండడం అవసరం. ప్రతికూల ఆలోచనలకూ దూరంగా ఉంటే మంచిది. ఆర్థిక సమస్యలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి.
కుంభరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహవంతంగా ఉంటాయి. ఆర్థికంగా ఎదగడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో పనిపట్ల మీరు చూపే శ్రద్ధ ఉన్నతాధికారులను ఆకట్టుకుంటుంది. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి.
మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో ఆటంకాల గురించిన ఆందోళనలు మీ పనిని ఆలస్యం చేస్తాయి. నిర్ణయాలు తీసుకునే సమర్థత కోల్పోతారు. భూమి, ఆస్తి వ్యవహారాలు వాయిదా వేస్తే మంచిది. కుటుంబంలో స్వల్ప విభేదాలు ఉండవచ్చు. పెద్దల మాటకు విలువ ఇవ్వడం వలన మేలు జరుగుతుంది.
Also Read: Syria: రెండు రోజుల్లో ఏకంగా 600మంది..సిరియాలో దాడులు
Also Read: Sam Altman: నా సోదరి పరువు తీసింది.. శామ్ ఆల్ట్‌మన్ సంచలన ఆరోపణలు