/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-01T094512.156.jpg)
Horoscope
మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆర్థిక ప్రయోజనాలు మెండుగా ఉంటాయి. అత్యాశకు పోతే సమస్యల్లో చిక్కుకుంటారు. చట్టపరమైన కార్యకలాపాల నుండి దూరంగా ఉండండి.
Also Read: Trump: పుతిన్ కంటే వాళ్లే యమ డేంజర్.. జాగ్రత్తగా ఉండాలంటూ ట్రంప్ సంచలన పోస్ట్!
వృషభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సంతానానికి సంబంధించిన శుభవార్త ఉత్సాహాన్ని కలిగిస్తుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. వ్యాపారులకు పరిస్థితి ఆశాజనకంగా ఉంది. సరైన చోట పెట్టుబడి పెడుతున్నారని ఖచ్చితంగా నిర్ధరించుకోండి.
Also Read: TG Inter Exams: తెలంగాణలో ఇంటర్ పరీక్షలు.. విద్యార్థులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే!
మిథునరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉన్నతాధికారులు మీ పనితీరు పట్ల పూర్తి సంతృప్తి చెందుతారు. కొన్ని పరిస్థితులు నిరుత్సాహం కలిగిస్తాయి. కుటుంబంలో కలహసూచన ఉంది. ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకోండి.
కర్కాటకరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ధర్మసిద్ధి ఉంది. బుద్ధిబలంతో చేసేపనులు సత్వర విజయాలనిస్తాయి. పరోపకార బుద్ధితో అందరి మన్ననలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు పొందేంకు మరింత కష్టపడాలి.
సింహరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో శ్రద్ధ లోపిస్తుంది. కుటుంబ వివాదాలకు అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలు పనులకు ఆటంకంగా కాకుండా చూసుకోండి. చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు దూరంగా ఉండండి.
బుద్ధిబలంతో...
కన్యారాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వృత్తిఉద్యోగ వ్యాపారాలలో అనుకూల ఫలితాలు ఉంటాయి. చేపట్టిన అన్ని పనులు విజయవంతమవుతాయి. బుద్ధిబలంతో కీలకమైన పనులను పూర్తి చేస్తారు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది.
తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా పూర్తిచేసి ప్రశంసలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపార పనుల నిమిత్తం ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలను సమయస్ఫూర్తితో అధిగమిస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారంలో ఆర్థిక లాభాలు ఉంటాయి.
ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. పోటీదారులను అధిగమిస్తారు. ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. నైపుణ్యాలను మెరుగు పరుచుకుంటూ ముందుకు సాగితే విశేషమైన ప్రయోజనం ఉంటుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.
మకరరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. మంచి శుభసమయం నడుస్తోంది. మట్టి ముట్టుకున్నా బంగారం అవుతుంది. విశేషమైన ఆర్థిక యోగం ఉంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని సరదాగా గడుపుతారు. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు.
కుంభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. చేపట్టిన పనుల్లో ఆచి తూచి వ్యవహరించాలి. మొహమాటాన్ని దరిచేరనీయకండి. ఆత్మబలంతో పనిచేస్తే ఒత్తిడి తగ్గుతుంది. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి.
మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ప్రయత్నకార్యసిద్ధి ఉంది. సమాజంలో ఖ్యాతి పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యం కలదు. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. తొందరపాటు నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి.
Also Read: Fire Accident: అమ్రాబాద్ అడవిలో భారీ అగ్ని ప్రమాదం.. నల్లమలలోకి ఎంట్రీ!