Horoscope:ఈ రాశులవారు ఆర్థిక విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి...!

వృషభరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. వృత్తివ్యాపారాలలో, ఆర్ధిక విషయాలలో ఈ రోజంతా చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్త కార్యక్రమాల జోలికి పోవద్దు..మిగిలిన రాశుల వారికి ఎలా ఉంటుందంటే..

New Update
horoscope

horoscope

మేషరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు, ఆర్ధిక సమస్యలతో నిరుత్సాహంగా ఉంటారు. కీలక వ్యవహారాల్లో దూకుడు తగ్గించుకుంటే మంచిది. కొత్తగా ఏ పనులు ఈ రోజు మొదలు పెట్టవద్దు. కుటుంబంలో ఏర్పడే చిన్న సమస్యల గురించి పట్టించుకోవద్దు. 

Also Read: Afghanistan: ఆఫ్గాన్‌కు కొత్త చట్టాలేమి అవసరం లేదంటున్న తాలిబాన్‌ చీఫ్‌!

వృషభరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. వృత్తివ్యాపారాలలో, ఆర్ధిక విషయాలలో ఈ రోజంతా చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్త కార్యక్రమాల జోలికి పోవద్దు. ప్రయాణాలు ఫలవంతం. తీర్ధయాత్రలలో పాల్గొని ఆధ్యాత్మికంగా గడపడం ప్రశాంతతనిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది.

Also Read: Trump-Iran:ఒప్పందం చేసుకోండి..లేకపోతే బాంబు దాడులే..ట్రంప్‌ హెచ్చరికలు!

మిథునరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలకు ఈ రోజు గొప్పగా ఉంటుంది. మీరు పట్టింది బంగారం అవుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంది ప్రయోజనాలు పొందుతారు. వ్యాపారంలో ఆదాయం బాగా పెరుగుతుంది. పెట్టుబడులు మంచి లాభాలనిస్తాయి.

కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ధర్మసిద్ధి ఉంటుంది. కోపాన్ని తగ్గించుకుని ప్రశాంతంగా ఉండండి. కీలక వ్యవహారాల్లో ఆచి తూచి నడుచుకుంటే మంచిది. కొన్ని ఇబ్బందికర సంఘటనల నుంచి బయట పడతారు.


సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. బంధు మిత్రులతో తీర్థయాత్రలకు వెళ్తారు. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారులు మంచి లాభాలు అందుకుంటారు

కన్యారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు, శ్రమ పెరుగుతాయి. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. బంధువులతో ఆచి తూచి వ్యవహరించాలి. బంధువులతో కలహాలు, మనస్పర్థలు పెరగకుండా జాగ్రత్త పడాలి. 

తులారాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. శుభసమయం నడుస్తోంది. మీ నైపుణ్యాన్ని చూసి అంతా ప్రశంసిస్తారు. అధికారుల సహాయసహకారాలు అందుకుంటారు. బంధుమిత్రులతో తీర్థయాత్రలకు ప్రణాళికలు వేస్తారు.

వృశ్చికరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. శారీరకంగా, మానసికంగా శక్తివంతంగా ఉంటారు. మీ విరోధులు ఈ రోజు ఓటమిని అంగీకరిస్తారు. ఉద్యోగులకు సహోద్యోగుల నుంచి సహాయం లభిస్తుంది. ఆర్ధిక లాభాలు పొందడానికి అవకాశం ఉంది. పెండింగు పనులు పూర్తిచేస్తారు.

ధనుస్సురాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో తీవ్రమైన జాప్యం ఆందోళన కలిగిస్తుంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఈ రోజు మీ సహనానికి పరీక్షగా ఉంటుంది. ప్రయాణాల్లో చోరభయం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి.

మకరరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కొన్ని అనుకోని సంఘటనల కారణంగా విచారంగా, నిరుత్సాహకరంగా ఉంటారు. సామాజిక, ధార్మిక కార్యకలాపాల కోసం విపరీతంగా ఖర్చు చేస్తారు. సంపద, ప్రతిష్ఠకు నష్టం కలిగే సూచనలున్నాయి. 

కుంభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో రాబడి పెరుగుతుంది. ఖర్చులు తగ్గుతాయి. ధర్మబద్ధంగా వ్యవహరించి అందరి మన్ననలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. 

మీనరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఆస్తికి సంబంధించిన వ్యవహారాల్లో ప్రతికూలత ఉంటుంది. ఆత్మవిశ్వాసం లోపించకుండా చూసుకోండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. సన్నిహితులతో వివాదాలకు అవకాశం ఉంది. మనోధైర్యం కోల్పోకుండా చూసుకోండి. వృత్తి ఉద్యోగాలను నిర్లక్ష్యం చేయవద్దు.

Also Read: Telangana: సన్నబియ్యం పథకం ప్రారంభం.. కొత్తగా 10 లక్షల రేషన్‌కార్డులు జారీ!

Also Read: Diseases Away: రాత్రి భోజనం తర్వాత ఇలా చేస్తే వ్యాధులు దూరం

horoscope | horoscope-today | todays-horoscope | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Romantic vacation: వారంలో 36 గంటలు శృంగార సెలవు.. ఆ దేశ ప్రభుత్వం సంచలన నిర్ణయం!

దేశ జనాభా పెంచేందుకు జపాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పెళ్లైన దంపతులు శృంగారంలో పాల్గొనేందుకు వారంలో 36 గంటలు సెలవు ఇవ్వాలని నిర్ణయించింది. 4 రోజులే పనిదినాలు అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 

New Update
Sexual ability: శృంగార సామర్థ్యం తగ్గిందా.. ప్రధాన కారణమిదే!

Japan Romantic vacation 36-hours in a week

Romantic vacation: దేశ జనాభా పెంచేందుకు జపాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జననాల రేటు భారీగా పడిపోతున్న నేపథ్యంలో బర్త్ రేట్ పెంచేందుకు వినూత్న ఆలోచన చేసింది. పెళ్లైన దంపతులు శృంగారంలో పాల్గొనేందుకు వారంలో 36 గంటలు సెలవు ఇవ్వాలని నిర్ణయించింది. వారానికి 4 రోజులే పనిదినాలు అమలు చేయనుంది. 

4 రోజులే పనిదినాలు..

ఈ మేరకు పనిభారంతోపాటు మారుతున్న కల్చర్ కారణంగా జననాల రేటు తగ్గిపోతోందని జపాన్ ప్రభుత్వం గుర్తించింది. అక్కడి యువత పిల్లలను కనాలంటే వణికిపోతున్నారట. దీంతో వారిలో భయాలు తొలగించేలా ప్రైవసీ కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. వారినికి 5 రోజులు కాకుండా 4 రోజుల మాత్రమే పనిదినాలు అమలు చేయాలని భావిస్తున్నారు. 36 గంటల విశ్రాంతి చాలా ప్రయోజనం చేకూరుస్తోందని, ప్రైవసీ ఉంటే దంపతులు శృంగారంలో పాల్గొనే అవకాశం ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. 

Also Read: విదేశాలపై ట్రంప్‌ టారీఫ్‌.. అమెరికాకు మాంద్యం తప్పందంటున్న పెట్టుబడిదారులు !

ఇక గతకొన్నేళ్లుగా జపాన్ జనాభా రేటు తగ్గిపోతోంది. తాజా అధ్యయనం ప్రకారం మనుషులు లేక 9 మిలియన్ల ఇళ్లు ఖాళీగా ఉన్నాయని అధికారులు తెలిపారు. ప్రపంచంలోనే జపాన్ అత్యల్ప జనన రేటు కలిగిన దేశాల్లో ఒకటిగా ఉంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రోత్సాహకాలు, పిల్లల సంరక్షణకు సబ్సిడీ, పెళ్లి చేసుకుంటే కానుకలు అందిస్తున్నారు. 

Also Read: తల్లికి, బిడ్డకు ఒకేసారి కడుపు చేసిన యూట్యూబర్.. నెట్టింట ఫొటోస్ షేర్ చేయడంతో రచ్చ రచ్చ!

apan | govt | holidays | today telugu news japan

Advertisment
Advertisment
Advertisment