/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-26-1-jpg.webp)
horoscope
మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజంతా ఆనందోత్సాహాలతో గడుపుతారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. బంధు మిత్రులతో వేడుకల్లో మునిగితేలుతారు. అన్ని రంగాల వారికి చేపట్టిన పనుల్లో విజయం చేకూరుతుంది. ప్రయాణాలు ఫలవంతంగా ఉంటాయి.
వృషభరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. కుటుంబ సభ్యులకు సంబంధించిన ఒక శుభవార్త మీకు ఉత్సాహాన్ని కలిగిస్తుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. వ్యాపారులకు ఈ రోజు ఆశాజనకంగా ఉంటుంది. నమ్మకమైన చోట పెట్టుబడి పెడుతున్నారని నిర్ధారించుకోండి.
Also Read: Ugadi 2025: ఈ సారి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం.. దాని అర్థం.. ప్రత్యేకత ఏంటో తెలుసా?
మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇంటి పనులు, ఉద్యోగ బాధ్యతలతో ఈ రోజంతా క్షణం తీరిక లేకుండా గడుపుతారు. మీ ప్రతిభతో, పనితీరుతో అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. కుటుంబంలో సుఖశాంతులు లోపిస్తాయి. వివాదాలకు, కలహాలు దూరంగా ఉంటే మంచిది.
కర్కాటకరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన . ఫలితాలు పొందేందుకు కష్టపడాలి. ఆర్థికంగా ఎదగడానికి చేసే ప్రయత్నాలు ఫలించవు. వివాదాలకు దూరంగా ఉంటే మంచిది.
సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. దైవారాధన మానవద్దు. ఇతరుల సహకారంలో అదనపు ఆదాయ వనరులు సమకూర్చుకుంటారు.
కన్యారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కాలానుగుణంగా ముందుకు సాగితే మెరుగైన ఫలితాలు ఉంటాయి. నూతన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు. ఇంటికి బంధువుల రాకతో సందడి నెలకొంటుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. ఓ వ్యవహారంలో ధననష్టం సంభవించవచ్చు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.
తులారాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. శుభసమయం నడుస్తోంది. మీ నైపుణ్యాన్ని చూసి అంతా ప్రశంసిస్తారు. అధికారుల సహాయసహకారాలు అందుకుంటారు. బంధుమిత్రులతో తీర్థయాత్రలకు ప్రణాళికలు వేస్తారు.
వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపార సంబంధిత పనులపై ప్రయాణానికి సిద్ధంగా ఉండండి. ఆర్థిక లాభాలు ఉంటాయి. డబ్బు పొదుపుగా ఖర్చు చేయడం అవసరం.
ధనుస్సురాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా మనోధైర్యంతో అధిగమిస్తారు. ఒక వార్త మనస్తాపానికి గురి చేస్తుంది. జీవిత భాగస్వామితో కలహాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి.
మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు అమ్మకాలు లాభదాయకంగా ఉంటాయి. ఊహించని ఖర్చులు ఉండవచ్చు. సమాజంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థిక లాభాలున్నాయి. ప్రయాణాలు అనుకూలం. ఆరోగ్యం బాగుంటుంది.
కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ప్రయత్నపూర్వక కార్యసిద్ధి ఉంది. వృత్తి ఉద్యోగాలలో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మీనరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. కీలక వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు చేటుచేస్తాయి. ఉద్యోగులకు స్వస్థానప్రాప్తి ఉంది. బంధువుల ప్రవర్తన విచారం కలిగిస్తుంది. ముఖ్యమైన పనుల్లో ఆచి తూచి వ్యవహరించాలి. ఆర్థిక లావాదేవీల్లో మోసపోకుండా జాగ్రత్త వహించండి.
Also Read: Indian Railways: భారతీయ రైల్వేకు రోజుకు ఎన్ని కోట్లు వస్తాయో తెలుసా ?
Also Read: Ugadi IPhone Offers: ఉగాది ఆఫర్లు.. IPHONE 15_ 6/512జీబీ ధర భారీగా తగ్గింపు- డోంట్ మిస్!
horoscope | horoscope-today | todays-horoscope | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates