/rtv/media/media_files/2025/01/25/1OMq4QlbeytD7eXzGRTr.jpg)
Horoscope Today
మేషరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఊహించని సమస్యలు ఎదురవుతాయి. బుద్ధిబలంతో సమస్యలు పరిష్కరిస్తారు. అనవసరమైన వాదనలు, అర్థంలేని చర్చలకు దూరంగా ఉంటే మంచిది. ప్రతికూల ఆలోచనలు వీడండి. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది.
Also Read: Delhi Railway station : ట్రైన్ల ఆలస్యంతో కిక్కిరిసిన ఢిల్లీ రైల్వే స్టేషన్!
వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉత్సాహంతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. స్వశక్తితో లక్ష్యాలను సాధిస్తారు. అవసరానికి సరిపడా డబ్బు అందుతుంది. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. పెద్దల ఆశీర్వాద బలంతో కీలక వ్యవహారాల్లో విజయం సాధిస్తారు.
Also Read: Italy: ఆ ప్రాంతంలో స్థిరపడితే కనుక రూ. 92 లక్షలు మీవే !
మిథునరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. బంధు మిత్రులతో సంతోషంగా గడుపుతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు అందుకుంటారు. ఆర్థికంగా శుభయోగాలున్నాయి.
కర్కాటకరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఇంటా బయటా కలిసి వచ్చే కాలం. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతులకు అవకాశం ఉంది. మీ అధికార పరిధి విస్తరిస్తుంది. వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఓ శుభవార్త మీ మనోబలాన్ని పెంచుతుంది. ఊహించని ధనలాభాలకు అవకాశముంది.
సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పట్టుదలతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. పెద్దల ఆశీర్వాద బలం అండగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో శ్రమ పెరగవచ్చు. అస్థిర బుద్ధితో తీసుకునే నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోండి.
కన్యారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అనారోగ్యం కారణంగా బద్ధకం, బలహీనత ఆవరించి ఉంటుంది. మొహమాటంతో నష్టం కలగవచ్చు. ఖర్చులు పెరిగి ఆర్థికపరమైన సమస్యలు వస్తాయి. సమాజంలో మీ ఖ్యాతి తగ్గకుండా చూసుకోండి.
తులారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో పట్టుదలతో పనిచేస్తే విజయం లభిస్తుంది. కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టేందుకు మంచి రోజు. కీర్తి ప్రతిష్టలు, గౌరవం పెరుగుతాయి. కుటుంబంలో కలహపూరిత వాతావరణం ఉంటుంది.
వృశ్చికరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా కఠినమైన పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుంది. కొన్ని ఘటనలు నిరుత్సాహం కలిగిస్తాయి. ఉద్యోగులకు, వృత్తి నిపుణులకు ఆర్థికభారం, పని ఒత్తిడి అధికంగా ఉంటాయి. సహనంతో ఉంటే అన్ని సర్దుకుంటాయి. మీ పనితీరుకు ప్రశంసలు అందుకుంటారు.
ధనుస్సురాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. శుభ గ్రహాల అనుకూలత కారణంగా చేసే ప్రతి పని విజయవంతమవుతుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. బంధు మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆర్థికంగా విశేషమైన లాభాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవడం సంతృప్తి కలిగిస్తుంది. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినా అధిగమిస్తారు.
మకరరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. మనోధైర్యంతో విశేషమైన కార్యసిద్ధి ఉంది. వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఉన్నప్పటికీ బుద్ధిబలంతో అధిగమిస్తారు. ఉద్యోగంలో శుభయోగాలున్నాయి. నూతన బాధ్యతలు చేపడతారు. ఓ ఘటన విచారం కలిగిస్తుంది.
కుంభరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. వృత్తి పరంగా, ఆర్థికపరంగా అభివృద్ధి చెందుతారు. మీ స్వధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. చేపట్టిన పనుల్లో శ్రమ పెరగవచ్చు. కీలక వ్యవహారాల్లో తెలివిగా నడుచుకుంటే సత్ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో అభిప్రాయం భేదాలు ఏర్పడకుండా చూసుకోండి.
మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. ఆర్థికపరంగా, వృత్తిపరంగా ఆశించిన లాభాలు, పదోన్నతులు ఉంటాయి. వైవాహిక జీవితంలో మాధుర్యం చోటు చేసుకుంటుంది. ఒక శుభవార్త వింటారు. వృధా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది
Also Read: National: భారత బార్డర్‌లోకి AI-ఆధారిత రోబోలు.. అదే లక్ష్యంతో ముందుకు!
Also Read: SKM: రైతులకు SKM కీలక పిలుపు.. పోలీసుల అణచివేతపై దేశవ్యాప్తంగా నిరసన!
horoscope | horoscope-today | todays-horoscope | latest-news | latest-telugu-news | latest telugu news updates