/rtv/media/media_files/2025/03/21/DlTh1Ox3qhwLZRDu4Gje.jpg)
horoscope
మేషరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఆరంభించిన పనులు పూర్తి కావాలంటే ఏకాగ్రత చిత్తశుద్ధి అవసరం. కోపాన్ని నియంత్రణలో ఉంచుకోకపోతే కలహాలు తప్పవు. ఇంటా బయటా ఉద్రిక్తత, శత్రుత్వంతో పని పట్ల ఏకాగ్రత లోపిస్తుంది.
Also Read: America: అమెరికాలో మరోసారి కాల్పులు...ముగ్గురు మృతి..15 మందికి తీవ్ర గాయాలు!
వృషభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు, పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఎంత కష్టపడినా విజయం అంత త్వరగా లభించదు. బుద్ధిబలంతో వ్యవహరిస్తే ఆటంకాలు తొలగిపోతాయి. కొత్త పనులు ప్రారంభించడానికి సమయం అనుకూలంగా లేదు.
Also Read: Punjab National Bnak Scam:బెల్జియంలో ఛోక్సీ..రప్పించేందుకు భారత్ విశ్వ ప్రయత్నాలు!
మిథునరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్తారు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు సత్ఫలితాన్నిస్తాయి.
కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. కుటుంబంలో ఆనందోత్సాహాలు నెలకొంటాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధు మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఓ శుభవార్త మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది.
సింహరాశి వారికి మీరు ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. కొన్ని రోజులుగా ఇబ్బంది పెడుతున్న సమస్యకు పరిష్కారం లభిస్తుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. రచయితలకు కలిసి వచ్చే కాలం. సన్మాన సత్కారాలు అందుకుంటారు. విద్యార్థులు పరీక్షలు బాగా రాస్తారు.
కన్యారాశి వారికి ఈ రోజు ప్రతికూల పరిస్థితులు ఉండవచ్చు. ఆర్థిక అనారోగ్య సమస్యలతో నిరుత్సాహంగా ఉంటారు. కొన్ని ఆందోళనలు మీ మనసును పీడించవచ్చు. జీవిత భాగస్వామితో వాదనలు, ఘర్షణలకు అవకాశం ఉంది. మీ తల్లిగారి అనారోగ్యం ఆందోళన కలిగించవచ్చు. భూమి, ఆస్తికి సంబంధించిన విషయాలతో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి.
తులారాశి వారికి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో, బంధువులతో అనుబంధం దృఢపడుతుంది. తీర్థయాత్రలకు వెళ్తారు. ఆదాయం పెరగడం ఆనందం కలిగిస్తుంది.
వృశ్చికరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. ఉద్యోగులు తమ పై అధికారులతో జాగ్రత్తగా నడుచుకోవాలి. కుటుంబ కలహాలు రాకుండా మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి.
ధనుస్సురాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు బుద్ధిబలంతో అధిగమిస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. సకాలంలో అన్ని పనులు పూర్తి కావడం ఆనందం కలిగిస్తుంది. ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి.
మకరరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ధార్మిక, ఆధ్యాత్మికమైన కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో చిన్నపాటి సమస్యలు ఎదురవుతాయి. కోర్టుకు సంభందించిన విషయాల్లో శ్రద్ద వహించండి. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి.
కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. లక్ష్యసాధన కోసం శ్రమిస్తారు. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. చేపట్టిన పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోండి.
మీనరాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. అదృష్టం అనుకూలిస్తోంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు అందుకుంటారు. ఆకస్మిక ధనలాభాలు కూడా ఉండవచ్చు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న కుటుంబ వేడుకలో ఉత్సాహంగా పాల్గొంటారు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టండి.
Also Read: కోహ్లీ ఖాతాలో అరుదైన ఘనత... దినేష్ కార్తీక్ తరువాత మూడో ఆటగాడిగా రికార్డు!
Also Read: Delimitation : JAC సంచలన నిర్ణయం.. ‘డీలిమిటేషన్ ప్రక్రియ మరో 25ఏళ్లు వాయిదా
horoscope | horoscope-today | todays-horoscope | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates