/rtv/media/media_files/2025/01/02/grRiAMp2oICATHmX0uII.jpg)
horoscope 2025 today
మేషరాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలు ఉంటాయి. దైవబలంతో క్లిష్టమైన సమస్యలు పరిష్కరిస్తారు. పట్టుదలతో చేపట్టిన పనుల్లో విజయాలు సాధిస్తారు. ఒక శుభవార్త మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. వృత్తి ఉద్యోగాలలో ఎదురయ్యే ఆటంకాలను బుద్ధిబలంతో అధిగమిస్తారు.
Also Read: London Airport: లండన్ ఎయిర్ పోర్టులో మంటలు 1350 విమానాలకు అంతరాయం!
వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. బుద్ధిబలంతో అనుకున్నది సాధిస్తారు. పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఆర్థికంగా పుంజుకుంటారు.
మిథునరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. అన్ని రంగాల వారు తమ తమ రంగాలలో పేరు ప్రతిష్ఠలు, ఆర్థిక లాభాలు అందుకుంటారు. క్లిష్టమైన పనులను కూడా సునాయాసంగా పూర్తి చేస్తారు. ఆర్థికాభివృద్ధి ఆనందం కలిగిస్తుంది.
Also Read: Fire Accident: కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం.. 1000 మంది కార్మికులు!
కర్కాటకరాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారులకు ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వృద్ధి చెందుతుంది. ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు సహోద్యోగుల సహకారం ఉంటుంది. స్థానచలనం, పదోన్నతులు ఉండవచ్చు. వృథా ఖర్చులు నివారిస్తే మంచిది.
సింహరాశి వారికి ఈ రోజు ఆనందదాయకంగా ఉంటుంది. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. కుటుంబసభ్యులు, సన్నిహిత మిత్రులతో విహారయాత్రకు ఏర్పాట్లు చేస్తారు. స్థిరాస్తి రంగం వారికి అద్భుతమైన రోజు. మంచి లాభాలు అందుకుంటారు.
కన్యారాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. కీలకమైన వ్యవహారాలకు, ప్రయాణాలకు ఈ రోజు మీకు అనువైన రోజు కాదు. సోమరితనం, బద్దకం వల్ల పనుల్లో జాప్యం జరిగే అవకాశాలున్నాయి. కీలక నిర్ణయాలు తీసుకుంటే శక్తి కోల్పోతారు. ఆస్తికి సంబంధించి లేదా కోర్టుకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది.
తులారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో ఆచి తూచి వ్యవహరించాలి. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో దూకుడు వద్దు. స్నేహితులతో విహారయాత్రలకు వెళ్తారు. కుటుంబ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి.
వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చిత్తశుద్ధితో చేసే పనులు సత్ఫలితాన్ని ఇస్తాయి. భాగస్వామ్య వ్యాపారంలో కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ వ్యక్తిత్వం ఎందరినో ప్రభావితం చేస్తుంది. చంచల నిర్ణయాలతో నష్టం వాటిల్లుతుంది. వృత్తి ఉద్యోగాలలో శ్రమ పెరగకుండా చూసుకోండి.
ధనుస్సురాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. సహచరుల సహకారంతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో శ్రమ, ఒత్తిడి పెరుగుతాయి. సన్నిహితులతో వాదప్రతివాదాలు పెరుగుతాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
మకరరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. మనోబలంతో చేసే పనులు విశేషమైన లాభాలు ఇస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ధార్మిక , సామాజిక కార్యకలాపాల కోసం అధికంగా ధనవ్యయం చేస్తారు.
కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి శుభప్రదమైన రోజు. వృత్తిపరంగా లాభించవచ్చు. సామాజికంగా మంచి కీర్తి ప్రతిష్ఠలు అందుకుంటారు. అవివాహితులకు కళ్యాణయోగం ఉంది. జీవిత భాగస్వామితో తీర్థయాత్రలకు వెళ్తారు.
మీనరాశి వారికి ఈ రోజు ఆశాజనకంగా లేదు. కుటుంబ సభ్యులతో మనస్పర్థలు ఏర్పడతాయి. ప్రతికూల ఆలోచనలు వీడితే మంచిది. దృఢ సంకల్పంతో సత్ఫలితాలు ఉంటాయి. అపోహలు, అపరాధాలకు తావివ్వవద్దు.
Also Read: BREAKING : కర్ణాటకలో 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు
Also Read: Union Home Minister Amit Shah: ‘ఓటు బ్యాంక్ రాజకీయాలతో కాశ్మీర్‌ను నాశనం చేశారు’
horoscope | horoscope-today | todays-horoscope | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates