/rtv/media/media_files/2025/03/21/DlTh1Ox3qhwLZRDu4Gje.jpg)
horoscope
మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దల సలహాలు తీసుకోండి. దూకుడుగా తీసుకున్న నిర్ణయం నష్టం కలిగించవచ్చు.
వృషభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మిమ్మల్ని రెచ్చగొట్టి ఇబ్బంది పెట్టే వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి. ప్రతీకారచార్యలు విడిచిపెట్టి ప్రశాంతంగా ఉండండి. మీ మంచితనం, సత్ప్రవర్తన మీకు అండగా ఉంటాయి. ఖర్చులు అదుపులో ఉంచుకోండి.
Also Read: New Jersey:ఫుల్లుగా తాగి కారు డ్రైవ్ చేసిన మేయర్..
మిథునరాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలోఆశించిన ఫలితాలు అందుకుంటారు. ఆరోగ్యం పట్ల అధిక శ్రద్ధ చూపిస్తారు. ప్రమోషన్, మార్కెటింగ్ రంగాల్లో ఉండేవారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది.
కర్కాటకరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఇతరుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసిరావు. ఓ సంఘటన విచారం కలిగిస్తుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.
సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారలాలు లాభదాయకంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో అనవసరమైన వాదనలకు దూరంగా ఉంటే మంచిది. అన్ని రంగాల వారికి పనిభారం పెరుగుతుంది. చిన్న చిన్న ఇబ్బందులను అధిగమిస్తే సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది.
కన్యారాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. పట్టుదలతో పనిచేసి విజయాలను అందుకుంటారు. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. చేపట్టిన ప్రతిపనిలోను సత్ఫలితాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.
తులారాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఖర్చులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో మీ కృషికి తగిన ఫలితాలు అందుకుంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఓ వార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది.
వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. సన్నిహితుల నుంచి బహుమతులు అందుకుంటారు. ఆర్థికంగా శుభ ఫలితాలు సంతోషం కలిగిస్తాయి. ప్రియమైన వారిని కలుసుకుంటారు. శుభవార్తలు వింటారు.
ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో మీ ప్రణాళికలు సత్ఫలితాలను అందిస్తాయి. భవిష్యత్ కార్యక్రమాలు చేపడతారు. వ్యాపారంలో లాభాలు జోరందుకుంటాయి. వినోద కార్యక్రమాల కోసం అధిక ధనవ్యయం చేస్తారు.
కళ్యాణయోగం...
మకరరాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. స్నేహితులును, బంధువులను కలుసుకుంటారు. అవివాహితులకు కళ్యాణయోగం ఉంది. స్నేహితుల నుంచి ఆశ్చర్యకరమైన బహుమతి అందుకుంటారు. ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి.
కుంభరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వృత్తి వ్యాపార ఉద్యోగాలలో అభివృద్ధి దిశగా పయనిస్తారు. ధనలాభం ఉంది. చేపట్టిన పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోండి. కీలక వ్యవహారాలు మీకు అనుకూలంగా జరుగుతాయి. వృత్తిపరంగా చక్కగా రాణిస్తారు.
మీనరాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. ఈ రాశివారు ఈ రోజు గొప్ప శుభ ఫలితాలను అందుకుంటారు. వ్యాపారంలో ఊహించని ధనలాభాలు సంతోషాన్ని కలిగిస్తాయి. స్నేహితులతో విందు వినోదాలలో పాల్గొంటారు.
Also Read: కలర్ మారిందని కాలర్ పట్టుకుని కొట్టిన ఎమ్మెల్యే!
Also Read: KS: కర్ణాటకలో హనీ ట్రాప్..మంత్రులతో సహా..
horoscope | horoscope-today | todays-horoscope | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates