Horoscope Today: నేడు ఈ రాశివారు నమ్మిన వారే మోసం చేసే అవకాశాలున్నాయి..జర జాగ్రత్త!

సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి.నమ్మించి మోసం చేసే వారున్నారు జాగ్రత్త.మిగిలిన రాశుల వారికి ఎలా ఉంటుందంటే..

New Update
Horoscope

Horoscope

మేషరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. మీ ప్రతిభతో, శక్తిసామర్థ్యాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తారు. శుభ సమయం నడుస్తోంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే సత్ఫలితాలు సాధించవచ్చు. 

Also Read: Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణ పనుల్లో బ్లాస్టింగ్.. ఒకరు మృతి!


వృషభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. గ్రహసంచారం అనుకూలంగా లేదు కాబట్టి వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు ఉండవు. ఘర్షణలకు, వాదనలకు దూరంగా ఉండడం మంచిది. 

మిథునరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ మనస్సుకు నచ్చిన పనులు చేయడం ఆనందం కలిగిస్తుంది. ధార్మిక కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. 

కర్కాటకరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఊహించని ఘటనలు విచారం కలిగిస్తాయి. మీ ప్రతిభతో సమస్యల నుంచి బయట పడతారు. ఖర్చులు పెరుగుతాయి.

Also Read: IPL 2025: రోహిత్ శర్మ కెప్టెన్సీపై పంజాబ్ కింగ్స్ బ్యాటర్ షాకింగ్ కామెంట్స్.. తన కోరిక అదేనంటూ!

సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. కొందరి ప్రవర్తన మనస్తాపం కలిగిస్తుంది. నమ్మించి మోసం చేసే వారున్నారు జాగ్రత్తగా ఉండండి. 

కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కీలకమైన సమావేశాలలో మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఉద్యోగులు ఓ కీలకమైన ప్రాజెక్టులో సమయస్ఫూర్తితో వ్యవహరించి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. 

తులారాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఖర్చులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో మీ కృషికి తగిన ఫలితాలు అందుకుంటారు. వ్యాపారం కోసం నిధులు సమకూరుస్తారు. 

వృశ్చికరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. శ్రద్ధాసక్తులతో పనిచేస్తే సత్ఫలితాలుంటాయి. వివాదాలకు, వదంతులకు దూరంగా ఉండండి. మీ మాట తీరు, కోపం నియంత్రణలో ఉంచుకోవడానికి ప్రయత్నించండి. 

వృత్తి వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలు..

ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. వృత్తి వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. 

మకరరాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. స్నేహితులును, బంధువులను కలుసుకుంటారు. అవివాహితులకు కల్యాణయోగం ఉంది. స్నేహితుల నుంచి ఆశ్చర్యకరమైన బహుమతి అందుకుంటారు.

కుంభరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాలలో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. కుటుంబంలో ఆనందం, ఉత్సాహం ఉంటుంది. మీ పట్టుదల, ఆత్మవిశ్వాసం కలిసికట్టుగా అద్భుతాలు సృష్టిస్తాయి.

మీనరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. వృత్తి వ్యాపారాలలో ఆచి తూచి అడుగేయాలి. చేపట్టిన పనుల్లో ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడండి. బంధుమిత్రులతో వివాదాలకు అవకాశం ఉంది. ఆర్థిక నష్టం సంభవించే సూచన ఉంది.

Also Read: sunita williams: ఇండియన్స్‌తో సునీతా విలియమ్స్ రేర్ ఫొటోలు.. చూశారంటే నిజమేనా అనడం పక్కా!

Also Read: Trump-Biden: బైడెన్ చేసిన క్షమాభిక్షలు చెల్లవు అంటున్న ట్రంప్!

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు