/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-01T094512.156.jpg)
Horoscope
మేషరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. భావోద్వేగాలు అదుపులో ఉంచుకోవడం అసాధ్యమవుతుంది. ఆస్తి, భూతగాదాలలో అప్రమత్తగా ఉండాలి. గ్రహసంచారం అనుకూలంగా లేదు. కాబట్టి ఈ రోజు కీలక ఒప్పందాలపై సంతకాలు చేయవద్దు.
Also Read: Elan Musk: ఎక్స్ సేవల్లో అంతరాయం..ఇది భారీ సైబర్ దాడే అంటున్న మస్క్!
వృషభరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపార వ్యవహారాలు ఇబ్బందికరంగా, సంక్లిష్టంగా మారుతాయి. ఓటములు, సవాళ్లు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి. సమస్యలను మీ ప్రతిభతో అధిగమిస్తారు.
మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రులను కలవడం ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆర్థికపరంగా కొన్ని చిక్కులు ఏర్పడతాయి. పెండింగ్ పనులు పూర్తి కావడం వల్ల ప్రశాంతంగా ఉంటారు. ఖర్చులు తగ్గించుకుంటే మంచిది.
Also Read: Syria: సిరియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు.. అంతర్యుద్ధానికి కారణం ఏంటి ?
కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కార్యసిద్ధి ఉంది. చేపట్టిన పనుల్లో విజయం సిద్ధిస్తుంది. జీవితభాగస్వామితో అనుబంధం దృఢ పడుతుంది. విహార యాత్రలకు, తీర్థ యాత్రలకు వెళ్లారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
సింహరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. చంద్రమంగళ యోగంతో విశేషమైన ఆర్థిక లాభాలు ఉంటాయి. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. న్యాయపరమైన వివాదాలకు దూరంగా ఉంటే మంచిది.
కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అనారోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయవద్దు. వ్యక్తిగతంగా, వృత్తిగతంగా ప్రయోజనకరంగా ఉంటుంది. సంపద కలుగుతుంది.
తులారాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. మీ పనితీరుతో ఉన్నతాధికారులను మెప్పిస్తారు. ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నవారు శుభ వార్తలు అందుకుంటారు.
వృశ్చికరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి పని చేసే చోట పరిస్థితులు కొంత వ్యతిరేకంగా ఉండనున్నాయి.సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే అన్ని సమస్యలు సర్దుకుంటాయి. ప్రశాంతంగా ఉండండి. మానసిక ప్రశాంతతకు భంగం కలిగే పనులు చేయవద్దు.
ధనుస్సురాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు అధికంగా ఉంటాయి. చికిత్స కోసం అధికంగా ధనవ్యయం కావచ్చు. ఉద్యోగులకు పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన పనులు, ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. కోపాన్ని అదుపులో ఉంచుకోండి.
మకరరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారులకు వాణిజ్య సంబంధాలు మెరుగ్గా ఉంటాయి. పెట్టుబడులు, లాభాల రూపంలో ధన ప్రవాహం ఉంటుంది. వ్యాపార అవకాశాలు మెరుగుపడతాయి. నూతన ఆదాయ వనరులు మీ ఆదాయాన్ని పెంచుతాయి.
కుంభరాశి వారికి ఈ రోజు విజయవంతంగా ఉంటుంది. అన్ని రంగాల్లో విజయాన్ని చూస్తారు. మీ పనితీరుకు, సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. కుటుబ సభ్యులతో గడిపే సమయం మీకు ఆనందాన్ని అందిస్తుంది. ఆశించిన లాభాలు రావడం వల్ల ఆర్థికంగా కూడా ఈ రోజంతా మీరు ఉత్సాహంగా ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది.
మీనరాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజు విద్యార్థులకు శుభసూచకంగా ఉంది. తారాబలం బలంగా ఉంది కాబట్టి అన్ని రంగాల వారు వృత్తి వ్యాపారాలలో కొత్త అవకాశాలు అందుకుంటారు. గిట్టనివారు చేసే విమర్శలు పట్టించుకోవద్దు.
Also Read: Champions Trophy 2025: ఛాంపియన్లకు ‘వైట్ జాకెట్’.. ఇంత ప్రాధాన్యత ఉందా?