/rtv/media/media_files/2025/02/21/9gqJLVvZ8dNM8DkuxoE6.jpg)
horoscopee
మేషరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలతో నిరుత్సాహంగా ఉంటారు. కీలక వ్యవహారాల్లో దూకుడు తగ్గించుకుంటే మంచిది. కుటుంబంలో ఏర్పడే చిన్న సమస్యల గురించి పట్టించుకోవద్దు.
Also Read: Hezbollah-Nasralla: నసల్లా అంత్యక్రియలు..జనసంద్రంగా మారిన రోడ్లు..!
వృషభరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. వృత్తి, వ్యాపారాలలో, ఆర్థిక విషయాలలో ఈ రోజంతా చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్త కార్యక్రమాల జోలికి పోవద్దు. ప్రయాణాలు ఫలవంతం. తీర్థయాత్రలలో పాల్గొని ఆధ్యాత్మికంగా గడపడం ప్రశాంతతనిస్తుంది.
Also Read: Slbc Tunnel Accident: ఆ 8 మంది ఎక్కడ...ఎలా ఉన్నారో...సవాల్ గా మారిన సహాయక చర్యలు!
మిథునరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సౌఖ్యం, ఆర్థికవృద్ధి ఆనందం కలిగిస్తాయి. మీదైన రంగంలో పట్టుదలతో విజయాలు సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాలలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు.
కర్కాటకరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఇంటా బయటా సానుకూల వాతావరణం ఉంటుంది. పని ప్రదేశంలో గౌరవ సన్మానాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. స్నేహితుల సహకారం ఉంటుంది.
సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. బంధు మిత్రులతో తీర్థయాత్రలకు వెళ్తారు. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారులు మంచి లాభాలు అందుకుంటారు.
కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలం కాదు. వృత్తి పరమైన సమస్యలతో మానసికంగా చాలా ఒత్తిడి అనుభవిస్తుంటారు. సన్నిహితులతో కలహాలతో మనశ్శాంతి లోపిస్తుంది. కుటుంబ సభ్యుల అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్స్ పట్ల జాగ్రత్త వహించండి.
తులారాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. సోదరులతోనూ, సంబంధీకులతోనూ సంతోషంగా గడుపుతారు. ఒక తీర్థయాత్ర ఉండవచ్చు. ఆర్థిక సంబంధమైన విషయాల్లో అనుకూలత ఉంటుంది. విదేశాల నించి శుభవార్త అందుకుంటారు. సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
వదంతులకు దూరంగా..
వృశ్చికరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ధర్మసిద్ధి ఉంది. సత్కార్యాలు చేసి ప్రశంసలు పొందుతారు. వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. కుటుంబ సభ్యులతో వాదన పెట్టుకునే పరిస్థితులను రానీయకండి. వదంతులకు దూరంగా ఉండండి.
ధనుస్సురాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబంతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. వ్యాపారంలో రాబడి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి.
మకరరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కొన్ని అనుకోని సంఘటనల కారణంగా విచారంగా, నిరుత్సాహకరంగా ఉంటారు. సామాజిక, దైవ కార్యకలాపాలపైన విపరీతంగా ఖర్చు చేస్తారు. సంపద, ప్రతిష్టకు నష్టం కలిగే సూచనలున్నాయి.
కుంభరాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. చేపట్టిన పనులలో అన్ని విధాలా లాభాలతో చాలా సంతోషంగా ఉంటారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలమైన సమయం. ప్రత్యేకంగా వ్యాపారులకు ఈ రోజు ఫలవంతమైన రోజు.
మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఉన్నత పదవులు స్వీకరిస్తారు. సమాజంలో మీ స్థాయి పెరుగుతుంది. అన్ని రంగాల వారు తమ తమ రంగాలలో సానుకూలమైన ఫలితాలను అందుకుంటారు.
Also Read: PM Modi: దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారు: ప్రధాని మోదీ
Also Read: ఫ్రీగా కుంభమేళా ట్రిప్.. రూపాయి ఖర్చు పెట్టకుండా 1500KM ప్రయాణం