/rtv/media/media_files/2025/02/21/9gqJLVvZ8dNM8DkuxoE6.jpg)
horoscopee
మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే లక్ష్యాలను సులభంగా చేరుకుంటారు. శుభవార్తలు అందుకుంటారు. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
Also Read: AP: ఏపీలో ఆ ప్రభుత్వ ఉద్యోగులను తొలగించిన సర్కార్
వృషభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మిమ్మల్ని రెచ్చగొట్టి ఇబ్బంది పెట్టే వ్యక్తి మీకు ఈ రోజు ఎదురుపడే సూచనలు కనిపిస్తున్నాయి. మానసిక ప్రశాంతతకు భంగం కలిగే పనులకు దూరంగా ఉండండి. శుభకార్యాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో కొత్త అవకాశాలు అందుకుంటారు.
Also Read: Zelensky-Starmer: ఉక్రెయిన్ కి మద్దతుగా బ్రిటన్ ప్రధాని!
మిథున రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రమోషన్, మార్కెటింగ్ రంగాల్లో ఉండేవారికి ఈ రోజు బాగా లాభదాయకంగా ఉంది. సమాజంలో కీర్తి పెరుగుతుంది. కుటుంబ కలహాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి. ఖర్చులు అదుపులో ఉంచుకోండి.
కర్కాటక రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. స్పష్టమైన ఆలోచనా విధానంతో ముందుకు సాగి అద్భుతాలు సాధిస్తారు. మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచే సంఘటనలు జరుగుతాయి. కీలక వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఖర్చులు పెరుగుతాయి. కోపం అదుపులో ఉంచుకుంటే మంచిది.
సింహ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో అనవసరమైన వాదనలు ఉంటాయి. అన్ని రంగాల వారికి పనిభారం పెరుగుతుంది. చిన్న చిన్న ఇబ్బందులను అధిగమిస్తే సత్ఫలితాలు ఉంటాయి. ఆర్ధిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. నీటి గండం ఉంది కాబట్టి జలాశయాలకూ,దూరంగా ఉండండి.
కన్యా రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. పట్టుదలతో పనిచేసి విజయాలను అందుకుంటారు. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. చేపట్టిన ప్రతిపనిలోనూ సత్ఫలితాలు అందుకుంటారు. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.
శుభకార్యాలు...
తులా రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఖర్చులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో మీ కృషికి తగిన ఫలితాలు అందుకుంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. సన్నిహితుల నుంచి బహుమతులు అందుకుంటారు. ఆర్ధికంగా శుభ ఫలితాలు సంతోషం కలిగిస్తాయి. ప్రియమైన వారిని కలుసుకుంటారు. శుభవార్తలు వింటారు.
ధనుస్సు రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో మీ ప్రణాళికలు సత్ఫలితాలను అందిస్తాయి. భవిష్యత్ కార్యక్రమాలు చేపడతారు. వ్యాపారంలో లాభాలు జోరందుకుంటాయి.
మకర రాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. స్నేహితులును, బంధువులను కలుసుకుంటారు. అవివాహితులకు కళ్యాణయోగం ఉంది. స్నేహితుల నుంచి ఆశ్చర్యకరమైన బహుమతి అందుకుంటారు. ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి.
కుంభ రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వృత్తి వ్యాపార ఉద్యోగాలలో అభివృద్ధి దిశగా పయనిస్తారు. ధనలాభం ఉంది. చేపట్టిన పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోండి. కీలక వ్యవహారాలు మీకు అనుకూలంగా జరుగుతాయి. వృత్తిపరంగా చక్కగా రాణిస్తారు.
మీన రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ప్రతికూల ఆలోచనలతో మానసిక ప్రశాంతత లోపిస్తుంది. వృధా ఖర్చులు నివారిస్తే మంచిది. ఉద్యోగులు ఉన్నతాధికారులతో అప్రమత్తంగా ఉండాలి.
Also Read: Delhi: ఆర్థిక, రెవెన్యూ ఆమె దగ్గరే...ఢిల్లీ మంత్రుల శాఖల కేటాయింపులు ఇవే..
Also Read: ఛాంపియన్ ట్రోఫిలో భారత్ శుభారంభం.. మొదటి మ్యాచ్‌లోనే విక్టరీ