/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-01T094512.156.jpg)
Horoscope
మేషరాశి వారికి ఈ రోజు బాగుంటుంది. చక్కని ప్రణాళికతో పనిచేస్తే వృత్తి వ్యాపారాలలో మంచి ఫలితాలు కనపడుతున్నాయి. స్వల్ప ప్రయత్నంతోనే గొప్ప విజయాన్ని అందుకుంటారు. సన్నిహితులతో, స్నేహితులతో సరదాగా గడపబోతున్నారు.
Also Read: Maha Kumbh Mela:కుంభమేళాలో తగ్గని ట్రాఫిక్..300 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్!
వృషభరాశి వారికి ఈ రోజు మామూలుగా ఉంటుంది. కృషి, పట్టుదలతో చేపట్టిన పనుల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. సృజనాత్మకమైన ధోరణితో అందరి ప్రశంసలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉండదు. ఎవరిని గుడ్డిగా నమ్మి మోసపోకండి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.
Also Read: Rohit Sharma: రోహిత్‌శర్మ విధ్వంసం.. 76 బంతుల్లో సెంచరీ చేసిన హిట్‌మ్యాన్
మిథునరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. గతంలో ఇబ్బంది పెట్టిన క్లిష్టమైన పరిస్థితుల నుంచి బయటపడతారు. ఉద్యోగంలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త అందుకుంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో ఉల్లాసంగా సమయాన్నిగడుపుతారు. డబ్బుకు లోటుండదు.
కర్కాటకరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. చేపట్టిన పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో అధిగమిస్తారు. మనోధైర్యంతో ఓ కీలక విషయంలో ముందంజ వేస్తారు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. వ్యాపారంలో నష్టాలు రాకుండా జాగ్రత్త పడాలి.
సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజంతా వృత్తి పరమైన, వ్యక్తిగతమైన శుభవార్తలతో నిండి ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరగడం వల్ల సంతోషంగా ఉంటారు.
కన్యారాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో శుభఫలితాలు ఉంటాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని సరదాగా కాలాన్ని గడుపుతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహాలంకరణ కోసం అధిక ధనవ్యయం చేస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది.
క్లిష్టమైన పరిస్థితుల...
తులారాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో క్లిష్టమైన పరిస్థితుల కారణంగా ఆందోళనతో ఉంటారు. కుటుంబ సభ్యులతో విబేధాలు వచ్చే అవకాశం. బంధువుల పరివర్తన మనస్థాపం కలిగిస్తుంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి సమస్యలు ఎదురవుతాయి
వృశ్చికరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. మీ కోసం మీరు పని చేసుకోవడం ఈ రోజు చాలా అవసరం. వ్యాపారులు ఈ రోజు మంచి లాభాలు అందుకుంటారు. ఖర్చులు పెరుగుతాయి.
ధనుస్సురాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి చేపట్టిన పనుల్లో పురోగతి ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకోండి. వృత్తి జీవితం, వ్యక్తిగత జీవితం మధ్య సమతూకం పాటించడం చాలా అవసరం.
మకరరాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. మీ వాక్చాతుర్యంతో అందరినీ ఆకర్షిస్తారు. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సమాజంలో గౌరవ ప్రతిష్ఠలు పెరగడానికి అవకాశం ఉంది. ఆర్థిక లాభాలు మెండుగా ఉంటాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.
కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ పనితీరుతో అందరి దృష్టిని ఆకర్షిస్తారు. పనిపట్ల మీరు చూపే శ్రద్ధ మీకు ప్రశంసలు తెచ్చి పెడుతుంది. పెండింగ్ పనులన్నీ పూర్తిచేస్తారు. ఆర్థికంగా శుభ సమయం. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది.
మీనరాశి వారికి ఈ రోజు విశేషంగా యోగిస్తుంది. సంపూర్ణ మనోబలంతో అఖండ విజయాలు సాధిస్తారు. ఉత్సాహం, శక్తి నిండిన మనసుతో అద్భుతాలు సృష్టిస్తారు. దూరప్రాంతాల నుంచి అందిన శుభవార్త మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. వృత్తిపరంగా చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తారు.
Also Read: Prashant Bhushan: ఆప్ ఓటమిపై స్పందించిన ప్రశాంత్ భూషణ్.. కేజ్రీవాల్‌పై విమర్శలు
Also Read:Trump-America: అమెరికాలోని భారతీయులకు బిగ్ రిలీఫ్.. ఆ ఉత్తర్వులను కొట్టిపారేసిన కోర్టు