Horoscope: నేడు ఈ రాశివారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి..!

సింహరాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ఆర్ధిక లాభాలు మెండుగా ఉంటాయి. స్థిరాస్తి వ్యాపారస్తులకు కొనుగోళ్లు, అమ్మకాలు జోరందుకుంటాయి.మిగిలిన రాశులవారికి ఎలా ఉంటుందంటే..

New Update
horoscope 2025 today

horoscope 2025 today

మేషరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. సువర్ణావకాశం నేడు మీ ఇంటి తలుపు తట్టవచ్చు. విశేషమైన ఆర్థిక లాభాలు ఉంటాయి. భవిష్యత్తు కోసం తగిన పొదుపు చేసుకోగలుగుతారు. వ్యాపారులు కలిసివచ్చే అవకాశాలతో కొత్త మైలురాయి సృష్టించుకుంటారు. 

Also Read: Ap Weather Report: ఆ జిల్లాలలో పిడుగులతో భారీ వర్షాలు.. మరో మూడు రోజులు ఇంతే..

వృషభరాశి వారికి ఈ రోజు ఆనందదాయకంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో తీరిక లేని పనులతో విశ్రాంతి లోపిస్తుంది. మీ పనితీరుకు ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగస్థులకు స్థానచలనం ఉండవచ్చు. కుటుంబసభ్యులతో సరదాగా గడుపుతారు. 

Also Read: Trump Effect: పెద్దన్న నిర్ణయానికి ..ఏపీలో ఆక్వారంగం కుదేలు!

మిథునరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తిపరంగా చాలా ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ శక్తియుక్తులను ఒక్కచోటికి చేర్చి పనిచేస్తే తప్ప లక్ష్యాలను చేరుకోలేరు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. 

కర్కాటకరాశి వారికి ఈ రోజు సరదాగా గడిచిపోతుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం దృఢపడుతుంది. ఇంటికి అతిధుల రావడంతో పండగ వాతావరణం, సందడి నెలకొంటుంది. వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

సింహరాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ఆర్ధిక లాభాలు మెండుగా ఉంటాయి. స్థిరాస్తి వ్యాపారస్తులకు కొనుగోళ్లు, అమ్మకాలు జోరందుకుంటాయి. కుటుంబ సభ్యులతో అందమైన ప్రదేశానికి విహారయాత్రలకు వెళ్లే సూచనలు ఉన్నాయి.

కన్యారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనులు సాఫీగా సాగిపోతాయి. అనుకోని అవాంతరాలు వచ్చినా మనోబలాన్ని కోల్పోవద్దు. పట్టుదలతో కృషిచేస్తే అవాంతరాలు తొలగిపోతాయి. ఆరోగ్య సమస్యలు చికాకు పెడతాయి. అవసరానికి ధనం చేతికి అందుతుంది. 

తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. భవిష్యత్తుకు ఉపయోగపడే వ్యక్తులను ఈ రోజు కలుసుకుంటారు. వృత్తి పరంగా ఎదగడానికి ఈ పరిచయం దోహదపడుతుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. కోర్టు న్యాయ పరమైన విషయాల పట్ల జాగ్రత్తగా ఉండండి.

వృశ్చికరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. పని ఒత్తిడి చాలా తీవ్రంగా ఉంటుంది మీ ప్రతిభతో ఒత్తిడిని అధిగమిస్తారు. ఒత్తిడిని పారదోలేందుకు యోగా, ధ్యానం వంటి పనులు చేయండి. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. 

ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా ఈ రోజు చాలా ఒడుదొడుకులు ఎదుర్కొంటారు. ఆర్ధికంగా గత కొంతకాలంగా పడిన ఇబ్బందుల నుంచి విముక్తి వస్తుంది. వృధా ఖర్చులు నివారిస్తే మంచిది. కుటుంబంలో ప్రతికూల పరిస్థితులు ఉండవచ్చు.

మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వ్యాపార విస్తరణ పనులు లాభదాయకంగా ఉంటాయి. అనుకున్న రీతిలో పనులు సాగుతాయి. ఆర్థికపరమైన లావాదేవీలు అనుకూలంగా సాగుతాయి. 

కుంభరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా మీకు సహాయ సహకారాలు అందించే వ్యక్తిని కలుసుకోబోతున్నారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. 

మీనరాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు, అస్సైన్మెంట్లు మొదలు పెట్టడానికి శుభ సమయం. చంచల బుద్ధితో తీసుకునే నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో ఎదురయ్యే పోటీని సామర్ధావంతంగా అధిగమిస్తారు. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. 

Also Read: IPL 2025: పంత్ పీకిందేమీ లేదు.. గొయెంకా వెంటనే ఆ పని చేయండి: హర్భజన్ కీలక సూచన!

Also Read: Waqf land: దేశ భూభాగంలో 5% భూమి వక్ఫ్ బోర్డులదే.. 12వ శతాబ్దంలో మొదలై ఇప్పుడు 39లక్షల ఎకరాలు

horoscope | horoscope-today | Horoscope 2025 | todays-horoscope | latest-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

మూడు మూళ్లకు ఇవే బ్రహ్మ ముహూర్తాలు.. ఎల్లకాలం సుఖసంతోషాలే!

హిందూ సంప్రదాయం ప్రకారం శుభ ముహూర్తాలు చూసుకుని పెళ్లిళ్లు చేస్తారు. అయితే బుధవారం నుంచి ముహూర్తాలు రానున్నాయి. ఏప్రిల్ 16, 18, 20, 21, 23, 30 మే 1,3, 4, 8, 9, 10, 11, 14, 16, 18, 19, 21, 23, 24, 30, జూన్ 2, 4, 5, 6, 7, 8 వరకు ముహూర్తాలు ఉన్నాయి.

New Update
Marriage

Marriage

పెళ్లి చేసుకోవాలనుకునే వారికి ఇది శుభవార్త అని చెప్పవచ్చు. ఎందుకంటే పెళ్లికి శుభ ముహూర్తాలు చూసుకుని చేసుకుంటే సంతోషంగా ఉంటారని పెద్దలు మంచి ముహూర్తాలు చూసి వివాహం చేస్తారు. అయితే బుధవారం నుంచి జూన్ వరకు పెళ్లి భాజాలు మోగనున్నాయి. ఈ సమయంలో వివాహం చేసుకుంటే ఎల్లకాలం సంతోషంగా ఉంటారని పురోహితులు చెబుతున్నారు. మరి ఈ ఏడాది మంచి ముహూర్తాలు ఏయే తేదీల్లో ఉన్నాయో చూద్దాం. 

ఇది కూడా చూడండి: Shiva Puja: ఇంట్లో శివలింగం ఏ దిశలో ఉంచాలంటే?: శివభక్తులు తప్పక తెలుసుకోవాల్సిన 5 విషయాలు!

ముఖ్యమైన తేదీలు..

ఏప్రిల్ 16, 18, 20, 21, 23, 30,
మే 1,3, 4, 8, 9, 10, 11, 14, 16, 18, 19, 21, 23, 24, 30
జూన్ 2, 4, 5, 6, 7, 8 

ఇది కూడా చూడండి:Aghori Audio Call Leak: రాధీ నావల్ల కావట్లేదే.. ఫస్ట్‌ వైఫ్‌తో అఘోరీ రాసలీలల ఆడియో లీక్.. ఒక్కసారి విన్నారంటే?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. 

ఇది కూడా చూడండి: HIT 3 Trailer: ఆ నరుకుడు ఏంది సామి.. రక్తం ఏరులైపారిందిగా..! హిట్-3' ట్రైలర్ రిలీజ్..

 

Advertisment
Advertisment
Advertisment