/rtv/media/media_files/2025/02/21/9gqJLVvZ8dNM8DkuxoE6.jpg)
horoscopee
మేషరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. సువర్ణావకాశం నేడు మీ ఇంటి తలుపు తట్టవచ్చు. విశేషమైన ఆర్థిక లాభాలు ఉంటాయి. భవిష్యత్తు కోసం తగిన పొదుపు చేసుకోగలుగుతారు. వ్యాపారులు కలిసివచ్చే అవకాశాలతో కొత్త మైలురాయి సృష్టించుకుంటారు.
Also Read: Trump-Musk:డోజ్ నుంచి మస్క్ ఔట్..!
వృషభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు కష్టించి పనిచేసి లక్ష్యాలను సాధిస్తారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఇతరులకు స్ఫూర్తిదాయకంగా ఉంటారు. ఓ శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది.
Also Read: Trump Tarriffs:ప్రతీకార సుంకాల పై ట్రంప్ కీలక ప్రకటన..భారత్ కు ఎంత శాతం విధించారంటే..!
మిథునరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. పనుల్లో ఆలస్యం కారణంగా చికాకుతో ఉంటారు. ఉద్యోగాలలో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. విఘ్నాల నుంచి బయట పడాలంటే మానసింగా దృఢంగా ఉండడం అవసరం. కీలక విషయాలలో నిర్ణయాలు తీసుకొనే శక్తి లోపిస్తుంది.
కర్కాటకరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో ప్రతికూల పరిస్థితి ఉన్నప్పటికీ మీ కృషి, కఠిన శ్రమ కారణంగా చక్కని ఫలితాలు అందుకుంటారు. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు. ఆరోగ్యం అంతగా సహకరించకపోవచ్చు.
సింహరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఇంటా బయటా ప్రతికూల పరిస్థితులు ఉండవచ్చు. అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. వృత్తి, ఉద్యోగాలలో తీవ్రమైన ఒత్తిడి, ఉద్రిక్తత కారణంగా ఈ రోజంతా చికాకుగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో వాదనలు వద్ద. ఘర్షణల్లో మౌనంగా ఉండండి.
కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి, వ్యాపారాలలో తీవ్ర ప్రతికూలతలు ఉన్నప్పటికీ మనోబలంతో అన్నింటినీ అధిగమిస్తారు. దైవబలం రక్షిస్తోంది. అన్నింటా మీదే విజయం! ఆర్థికంగా ఓ మెట్టు పైకి ఎదుగుతారు.
తులారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అధిక పని ఒత్తిడి వల్ల మానసిక ఆందోళనకు గురవుతారు. ఆటంకాలను అధిగమించి అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. ఉద్యోగులకు నూతన అవకాశాలు వస్తాయి. ముందుచూపుతో వ్యవహరించి మంచి అవకాశాలను ఎంచుకుంటే జీవితం సాఫీగా సాగుతుంది.
వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారంలో శుభయోగాలున్నాయి. అనవసర విషయాల గురించి ఎక్కువ ఆలోచించవద్దు. ఆర్థికంగా శుభయోగం ఉంది. ఆకస్మిక ధనలాభాలు ఉండే అవకాశాలున్నాయి.
ధనుస్సురాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. పట్టుదలతో పనిచేసి అద్భుతమైన విజయాలను సాధిస్తారు. మీ పనితీరుకు ఉన్నతాధికారుల ప్రశంసలు లభిస్తాయి. ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా ఉంది. సంపద వృద్ధి చెందుతుంది.
మకరరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వృత్తినిపుణులు, వ్యాపారులకు అనుకూలమైన రోజు. ఓ ఘటన ఒత్తిడి కలిగిస్తుంది. ఆర్థికంగా శుభయోగాలున్నాయి.
కుంభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. వృధా ఖర్చులు ఉండవచ్చు. ప్రయాణాలు అనుకూలించవు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో స్థిరంగా ఉండడం మంచిది.
మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు సృజనాత్మకంగా అలోచించి ఉన్నత స్థానంలో నిలుస్తారు. వృత్తి వ్యాపారంలో అద్భుతంగా రాణిస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది.
Also Read:MLC Nagababu : అన్నయ్యా.. ఇది నాకెంతో స్పెషల్.. నాగబాబు ఎమోషనల్ ట్వీట్!
Also Raed: UPI: నిలిచిపోయిన యూపీఐ సేవలు...ఇబ్బందుల్లో వినియోగదారులు
horoscope | horoscope-today | todays-horoscope | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates