/rtv/media/media_files/2025/01/02/grRiAMp2oICATHmX0uII.jpg)
horoscope 2025 today
మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆస్తులకు సంబంధించిన ఆందోళన అధికంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. వృత్తి, ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.
వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి, వ్యాపారాలలో ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతులు, ఆర్థిక లాభాలు ఉంటాయి. సమాజంలో హోదా పెరుగుతుంది.
Also Read: Trump-America:ఈ సారి ట్రంప్ కొరడా ఆరోగ్య శాఖ పై..వేల సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు!
మిథునరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. గ్రహసంచారం సరిగా లేనందున అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కోపం అదుపులో ఉంచుకోవాలి. మాట్లాడేది పొరబాటు లేకుండా మాట్లాడాలి. లేదంటే వివాదాలు, అపార్థాలు రావచ్చు.
కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు కష్టించి పనిచేసి లక్ష్యాలను సాధిస్తారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. ఓ శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది.
సింహరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. సానుకూల ఆలోచనలతో, కృత నిశ్చయంతో వృత్తి, ఉద్యోగాలలో సత్ఫలితాలు సాధిస్తారు. సామాజికంగా మంచి గుర్తింపు పొందుతారు.
కన్యారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ప్రతికూల ఆలోచనలతో గందరగోళానికి గురవుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకోవడం కష్టమవుతుంది. ఉద్యోగులు పని పట్ల ఏకాగ్రతతో లేకపోతే ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురికాక తప్పదు. వ్యాపారులు తీవ్రమైన పోటీని ఎదుర్కొంటారు.
తులా రాశి వారికి ఈ రోజు మీకు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. గ్రహసంచారం సరిగా లేదు. దీంతో అన్ని రంగాల వారు జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోనూ వాదనల్లోకి దిగవద్దు. వివాదాలు, అనారోగ్యం, కోపం నష్టం కలిగిస్తాయి. కోపావేశాలు అదుపులో ఉంచుకోవాలి.
వృశ్చికరాశి వారికి ఈ రోజు విశేషమైన ప్రయోజనాలు ఉంటాయి. ఈ రాశి వారిని ఈ రోజు అధికారం అందలం ఎక్కిస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్ ఖాయం. స్థానచలనం కూడా ఉండవచ్చు. ఆర్థికంగా గొప్ప ప్రయోజనాలు ఉంటాయి. వ్యాపారులు ఊహించని లాభాలను అందుకుంటారు. సంఘంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు.
ధనుస్సురాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం, సంపద, సంతోషం, అదృష్టం అన్నీ కలిసి వస్తాయి. ఇంటి వాతావరణంలో సమన్వయ ధోరణి ఉంటుంది. పనిప్రదేశంలో రోజంతా చురుగ్గా వ్యవహరిస్తారు.
మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. అనారోగ్య సమస్యల కారణంగా చేసే పనిలో శ్రద్ధ, ఏకాగ్రత లోపిస్తుంది. పనులు సకాలంలో పూర్తి కాకపోవడంతో అశాంతిగా ఉంటారు. ఆదాయం ఆశించిన మేరకు ఉండకపోవచ్చు.
కుంభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో కీలకమైన ఘటనలు చోటు చేసుకుంటాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఉద్యోగులు పనిభారం పెరగడంతో ఒత్తిడికి లోనవుతారు. ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి.
మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. సమాజంలో మంచి గుర్తింపును పొందుతారు. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. గృహంలో శాంతి సౌఖ్యాలు నెలకొంటాయి.
Also Read: Ranveer Allahbadia: యూట్యూబర్ రణ్‌వీర్ అల్హాబాదియాకు షాక్.. సుప్రీం కోర్టు కీలక ప్రకటన
Also Read: Gold Rates: తాట తీస్తున్న బంగారం..10 గ్రాములు రూ.94 వేలతో సరికొత్త రికార్డ్
horoscope | horoscope-today | todays-horoscope | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates