Anemia Vs Food: రక్తహీనతతో బాధ పడుతున్నారా..? ఈ 4 ఆహారాలను ట్రై చేయండి

శరీరంలో రక్తం లేకపోవడం వల్ల రక్తహీనత వస్తుంది. అప్పుడు అలసట, తలనొప్పి, ఛాతీ నొప్పి, తరచుగా తలతిరగటం, చేతులు, కాళ్లలో వణుకు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ సమస్యలు తగ్గాలంటే ఆహారంలో తేనె, పాలకూర, దానిమ్మ, నల్ల నువ్వులు వంటి చేర్చుకోవాలి.

New Update
anemia Vs food

anemia Vs food

Anemia Vs Food: శరీరంలో రక్తం లేకపోవడం వల్ల రక్తహీనత(Anemia) వస్తుంది. ఈ స్థితిలో.. శరీరంలో హిమోగ్లోబిన్ లోపం(Hemoglobin Deficiency) ఉంటుంది. దీని కారణంగా శరీరంలో ఎర్ర రక్త కణాలు(Red Blood Cells) తగ్గుతాయి. అప్పుడు శరీర అలసట, తలనొప్పి(Headache), ఛాతీ నొప్పి(Chest Pain), తరచుగా తలతిరగడం, చేతులు, కాళ్ళలో వణుకు వంటి లక్షణాలు కనిపిస్తాయి. రక్తహీనతతో బాధపడేవారు ఆ సమస్య నుంచి త్వరగా బయటపడటం ముఖ్యం. దీన్ని సకాలంలో నియంత్రించకపోతే.. అది ఇతర ఆనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. అటువంటి సమయంలో ఆహారంలో కొన్ని ప్రత్యేక మార్పులు చేసుకోవాలి. రక్తహీనత వంటి పరిస్థితుల నుంచి రక్షించగల ఆ ఆహారాల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

Also Read: దారిలో మొసళ్లు, పాములు.. అక్రమంగా అమెరికా ఇలా వెళ్లాను.. పంజాబ్ వ్యక్తి కన్నీటి కథ!

రక్తహీనతను తగ్గించే ఆహారాలు:

ఆహారంలో తేనెను కూడా చేర్చుకోవచ్చు. ఇందులో మెగ్నీషియం, భాస్వరం, కాల్షియం ఉంటాయి. ఇది ఎముకలు, కండరాలకు మేలు చేస్తుంది. దీనిలో ఉండే ఐరన్‌ రక్తంలో హిమోగ్లోబిన్‌ను పెంచుతుంది. ఇది రక్తహీనత నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. పాలకూరలో ఐరన్‌ పుష్కలంగా లభిస్తుంది.  ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచటంతోపాటు హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడంలో సహాయపడుతుంది. దీని కారణంగా.. శరీరంలో ఎర్ర రక్తకణాలు మెరిగి రక్తహీనత నుంచి రక్షిస్తుంది. వీటిని రోజూ వారీ ఆహారంలో చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

Also Read: మలైకా అరోరాకి ఇష్టమైన జ్యూస్‌ ఇదే.. అది ఎలా తయారు చేయాలో తెలుసా..

దానిమ్మలో ఐరన్‌తోపాటు విటమిన్ ఎ, సి, ఇ, కెతోపాటు ఫైబర్, ఫోలేట్, పొటాషియం, ఇతర ముఖ్యమైన పోషకాలకు అద్భుతమైన మూలం. దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో రక్తం పెరుగుతుంది. ఇది రక్తహీనత నుంచి కాపాడుతుంది. నల్ల నువ్వులలో ఐరన్ రాగి, జింక్ పుష్కలంగా లభిస్తాయి. ఇంకా విటమిన్ బి6, విటమిన్ ఇ, ఫోలేట్ కూడా ఇందులో ఉన్నాయి. దీని వినియోగం శరీరంలో హిమోగ్లోబిన్‌ను పెంచడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

Also Read: విశాఖలో లారీ భీభత్సము.. పార్కులోకి దూసుకెళ్లడంతో..


గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Also Read: ఈ డ్రింక్స్‌ తాగితే  రోజంతా ఫుల్‌ ఎనర్జీ.. లిప్ట్ ఇదే

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు