Food Allergy: ఫుడ్‌ అలర్జీ డేంజర్.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

అలెర్జీ సాధారణమైనది. కొన్ని ఫుడ్స్ తీసుకున్న తర్వాత శరీరం దురదగా మారుతుంది. ఇంకా పెదవులు ఉబ్బుటంతోపాటు చర్మంపై మచ్చలు, గొంతు నొప్పి, దురద, నాలుక బరువెక్కడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలా జరిగితే జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

New Update
Food Allergy

Food Allergy Photograph

Food Allergy: ఫుడ్ అలర్జీ వల్ల కడుపు ఉబ్బరం, వాంతులు, గుండెల్లో మంట, అలసట, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. ఫుడ్ ఎలర్జీని నిర్ధారించడం కొంచెం కష్టం. ఇది అనేక లక్షణాలను కలిగి ఉంటుంది. కానీ ఆహారం తిన్న తర్వాత ఏదైనా అసౌకర్యం కలిగితే వైద్యులను సంప్రదించడం ఉత్తమం. గత కొన్ని రోజులుగా ఫుడ్ అలర్జీ ఘటనలు పెరిగిపోయాయి. ఆహారం తిన్న తర్వాత అలర్జీ వస్తుంది. దీనిని ఫుడ్ అలర్జీ అంటారు. మీ శరీరం ఏ పదార్థాన్ని అంగీకరించదు. యువతలో ఫుడ్ అలర్జీలు పెరుగుతున్నాయి. ఒక పరిశోధన ప్రకారం యువతలో 10 శాతానికి పైగా అలెర్జీలు ఉన్నాయి. 

కొన్ని ఆహారాలు కడుపులో తిమ్మిరి:

తరచుగా అలెర్జీ సాధారణమైనది. ఫుడ్ అలర్జీకి అతి పెద్ద కారణం ఏమిటో ఈ ఆక్టికల్‌లో తెలుసుకుందాం. ఒక నిర్దిష్ట ఆహారం తిన్న తర్వాత శరీరం దురదగా మారుతుంది, చర్మంపై మచ్చలు ఏర్పడతాయి కొన్ని ఆహారాలు తిన్న తర్వాత పెదవులు ఉబ్బుతాయి. నాలుక బరువెక్కుతుంది. అలెర్జీలు ఊపిరితిత్తులను కూడా ప్రభావితం చేస్తాయి. గొంతు నొప్పి, దురద మొదలవుతుంది, గొంతు బొంగురు పోవడం, నీరు మింగడంలో ఇబ్బంది, ఆహారం, గొంతు వాపు. ఊపిరి పీల్చుకోలేక పోవడం, ఛాతీలో నొప్పి, ఆకస్మిక దగ్గు మొదలవుతుంది. కొన్ని ఆహారాలు తీసుకుంటే కడుపులో తిమ్మిరి, వాంతులు సంభవిస్తాయి.

మీ రోగనిరోధక వ్యవస్థ ఒక నిర్దిష్ట ఆహారానికి అతిగా స్పందించినప్పుడు ఆహార అలెర్జీ సంభవిస్తుంది. మన శరీరంలో ఇమ్యునోగ్లోబులిన్ అనే ప్రొటీన్ ఉంటుంది. వివిధ ఇమ్యునోగ్లోబులిన్లు భిన్నంగా పనిచేస్తాయి. ఇమ్యునోగ్లోబులిన్ E బ్యాక్టీరియా, క్యాన్సర్ కణాలు వంటి శరీరానికి ప్రమాదకరమైన వాటిని గుర్తించి వేరు చేస్తుంది. శరీరానికి జీర్ణం కాని ఆహారం తింటే ఇది అలెర్జీని కలిగిస్తుంది. దాని లక్షణాలు వెంటనే శరీరంపై కనిపిస్తాయి.

గమనికఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: పొరపాటున కూడా పూజగదిలో ఈ వస్తువులు పెట్టొద్దు



 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

పీరియడ్స్ సమయంలో పరిగెత్తితే ఏమవుతుంది.. మంచిదేనా?

నిపుణులు అభిప్రాయం ప్రకారం.. నెలసరి టైంలో అరగంట సేపు తేలికగా పరుగెత్తడం ద్వారా శరీరం రిలాక్స్ అవుతుందట. అంతేకాదు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుందని చెబుతున్నారు. ఋతుక్రమ నొప్పి తీవ్రంగా ఉంటే పరుగెత్తడం మానుకోవాలని సూచిస్తున్నారు. 

New Update
Running fast

Running fast

పీరియడ్స్ సమయంలో మహిళల శరీరం అనేక శారీరక, మానసిక మార్పులకు లోనవుతుంది. ఈ సమయంలో సంభవించే మార్పులను  ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్ (PMS) అంటారు. కడుపు నొప్పి, అలసట, బలహీనత, రొమ్ము నొప్పి, మూడ్ స్వింగ్స్  ఇలా అనేక రకాల లక్షణాలు కనిపిస్తాయి. ఇటువంటి పరిస్థితుల్లో కొంతమంది మహిళలు విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడతారు. మరికొంతమంది శరీరాన్ని యాక్టీవ్ గా ఉండడానికి తేలికపాటి వ్యాయామాలు చేస్తారు. 

తేలికపాటి వ్యాయామం చేయడం సరేకానీ.. పీరియడ్స్ సమయంలో పరిగెత్తడం, గెంతడం వంటివి చేయొచ్చా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. అయితే నిపుణులు అభిప్రాయం ప్రకారం.. నెలసరి టైంలో అరగంట సేపు పరుగెత్తడం ద్వారా శరీరం రిలాక్స్ అవుతుందట. అంతేకాదు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుందని చెబుతున్నారు. అదేపనిగా పరుగెత్తడం చాలా ప్రమాదకరం. వేగంగా కాకుండా నెమ్మదిగా పరుగెత్తాలి. 

 పరిగెత్తితే ఏమవుతుంది? 

రక్త ప్రసరణను

నెలసరి సమయంలో పరుగెత్తడం రక్త ప్రసరణనను మెరుగుపరుస్తుంది.  సరైన రక్తప్రసరణ పెల్విన్ ప్రాంతంలో కలిగే  ఉబ్బరం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

మానసిక స్థితి

పీరియడ్స్ సమయంలో తేలికగా పరిగెత్తడం లేదా జాగింగ్ చేయడం వల్ల ఒత్తిడి హార్మోన్ (కార్టిసాల్) స్థాయిలు తగ్గడానికి ఉపయోగపడుతుంది. , ఇది చిరాకు,  మూడ్ స్వింగ్స్ ని  అదుపులో ఉంచుతుంది.

నొప్పి నుంచి ఉపశమనం

పీరియడ్స్ సమయంలో పరుగెత్తడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు (హ్యాపీ హార్మోన్లు) రిలీజ్ అవుతాయి.  ఇవి పీరియడ్స్ సమయంలో వచ్చే కడుపు నొప్పి, మూడ్ స్వింగ్స్ ని తగ్గించడంలో సహాయపడతాయి. 

ఎనర్జీ 

పీరియడ్స్ సమయంలో అలసట,   బలహీనత సర్వసాధారణం. 
ఈ సమయంలో పరుగెత్తడం వల్ల శరీరంలో శక్తి స్థాయి పెరుగుతుంది. దీనివల్ల  నీరసం తగ్గుతుంది. 

ఈ జాగ్రత్తలు తప్పనిసరి 

  • డీహైడ్రేషన్‌కు గురైనవారి పరిగెత్తడం మంచిది కాదు.
  • అలాగే  పీరియడ్స్  సయమంలో అదేపనిగా పరుగెత్తడం చాలా ప్రమాదకరం. వేగంగా కూడా పరుగెత్తవద్దు. నెమ్మదిగా పరుగెత్తాలి. 
  • ఋతుక్రమ నొప్పి తీవ్రంగా  ఉంటే పరుగెత్తడం మానుకోండి. 
Advertisment
Advertisment
Advertisment