/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/pizza-jpg.webp)
foods
ప్రస్తుతం రోజుల్లో చాలా మంది బయట ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా కొన్ని పదార్థాల వల్ల పొట్టలో కొవ్వు పెరిగిపోతుంది. అయితే పొట్టలో ఎలాంటి కొవ్వు పెరిగిపోకుండా ఉండాలంటే సాయంత్రం పూట వీటిని అసలు తీసుకోవద్దు.
తీపి పదార్థాలు
చక్కెర ఎక్కువగా ఉండే వాటిని సాయంత్రం 6 గంటలు తర్వాత తినకూడదని నిపుణులు చెబుతున్నారు. వీటిని సాయంత్రం సమయాల్లో తీసుకుంటే బొడ్డు కింద కొవ్వు ఎక్కువగా ఉండిపోతుంది. దీనివల్ల ఊబకాయం వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చూడండి: Ashwani Kumar : డెత్ ఓవర్ల స్పెషలిస్ట్.. రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!
ప్రోటీన్లు
రాత్రిపూట భారీ ప్రోటీన్లను తీసుకోవద్దని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ప్రొటీన్లు ఆరోగ్యానికి మంచివే. కానీ ఎక్కువగా వీటిని తీసుకుంటే తిన్న ఫుడ్ జీర్ణం కాదు. దీంతో కడుపు సంబంధిత సమస్యలు, జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు.
కార్బోనేటేడ్ పానీయాలు
వీటిని ఎక్కువగా తీసుకుంటే బాడీలో కొవ్వు పెరుగుతుంది. అలాగే గ్యాస్, ఉబ్బరం, కొవ్వు కూడా పెరుగుతాయి. కాబట్టి కార్బోనేటేడ్ పానీయాలను ఎక్కువగా తీసుకోవద్దు.
పాల ఉత్పత్తులు
వీటిని సాయంత్రం 6 గంటల తర్వాత తీసుకుంటే కడుపులో కొవ్వు పెరుగుతుంది. పాల ఉత్పత్తులు తీసుకుంటే.. ఉబ్బరం, జీర్ణ సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. ప్రస్తుతం రోజుల్లో చాలా మంది ఎక్కువగా పాలు, చీజ్, పెరుగు వంటివి తీసుకుంటున్నారు.
ఇది కూడా చూడండి: Ap Weather Alert: ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు.. ఈ జిల్లాల్లో వానలు..!
శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు
బియ్యం, పాస్తా, బ్రెడ్ వంటివి ఎక్కువగా తీసుకుంటే పొట్ట కింద కొవ్వు పెరిగే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
డీప్-ఫ్రైడ్
వేయించిన పదార్థాలు, పకోడీలు, కచోరీలు, సమోసాలు, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటివి సాయంత్రం తీసుకుంటే బాడీలో కొవ్వు పెరుగుతుంది. వీటిలోని అధిక కేలరీలు బరువు పెరిగేలా చేస్తాయి.
ఇది కూడా చూడండి: Horoscope Today: ఈ రాశివారు నేడు వివాదాలకు దూరంగా ఉంటే బెటర్!
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చూడండి: IPL 2025: బోణీ కొట్టిన ముంబై..ఐపీఎల్ లో మరో రికార్డ్