/rtv/media/media_files/2025/03/20/0TEYE5VnAwjpK555ab2l.jpg)
Curd with Banana Photograph: (Curd with Banana)
వేసవిలో చాలామంది పెరుగు, మజ్జిగ వంటివి తీసుకుంటారు. అయితే కొందరు వేసవిలో వేడిని తగ్గించుకోవడానికి పెరుగన్నంలో అరటి పండు వేసుకుని తింటారు. ఇలా వేసవిలో తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
ఇది కూడా చూడండి: USA: శాంతి ఒప్పందంపై జెల్స్ స్కీ కు ట్రంప్ కాల్..సుదీర్ఘ చర్చ
బాడీ కూల్
పెరుగు అన్నంలో అరటి పండ్లు వేసుకుని తింటే బాడీలో ఉన్న వేడి అంతా కూడా తగ్గుతుంది. సాధారణంగా వేసవిలో ఎక్కువగా వేడిగా ఉంటుంది. శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే పదార్థాలు ఎంత తీసుకున్నా కూడా వేడిగానే ఉంటుది. అదే పెరుగులో అరటి పండు కలిపి తీసుకుంటే బాడీ కూల్‌గా ఉంటుంది.
ఇది కూడా చూడండి: HYD: ఎల్బీ నగర్ లో దారుణం..బైక్ ను ఢీకొట్టి కిలోమీటర్ ఈడ్చుకెళ్ళిన కారు
జీర్ణ సమస్యలు
పెరుగులోని ప్రొబయోటిక్స్ జీర్ణ సమస్యలు రాకుండా చేస్తుంది. ఇందులోని హెల్తీ ఫ్యాట్ ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు ఎలాంటి ఇన్ఫెక్షన్ల రాకుండా చేస్తుంది. అలాగే అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు కూడా రాకుండా చేస్తుంది.
ఇది కూడా చూడండి: AP: ఆంధ్రాలో మరో సామూహిక అత్యాచారం..మైనర్ ను మూడు రోజులు నిర్భంధించి...
బాడీ హైడ్రేట్
వేసవిలో తొందరగా బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది. అదే మీరు పెరుగన్నంలో అరటి పండ్లు వేసుకుని తింటే బాడీ డీహైడ్రేషన్‌కు గురి కాకుండా హైడ్రేట్‌గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
పొటాషియం
పెరుగు, అరటి పండ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరానికి సహజంగా పోషకాలను అందించి రక్తపోటును కంట్రోల్ చేస్తుంది. దీనివల్ల గుండె పోటు వచ్చే ప్రమాదాలను తగ్గిస్తుంది.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.