/rtv/media/media_files/2025/03/24/6B98f0FjyVfDzW0aeTyO.jpg)
Breakfast Photograph: (Breakfast )
బిజీ షెడ్యూల్ వల్ల చాలా మంది ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌ను స్కిప్ చేస్తుంటారు. మీరు కూడా ఇలానే బ్రేక్‌ఫాస్ట్‌ను స్కిప్ చేస్తున్నట్లయితే రిస్క్‌లో పడినట్లే అని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్ అసలు స్కిప్ చేయకూడదు. ఎప్పుడో ఒకసారి ఉదయం టిఫిన్ తినకపోతే పర్లేదు. కానీ డైలీ కూడా ఉదయం పూట టిఫిన్ తినకపోతే దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చూడండి: USA: యెమెన్ పై అమెరికా దాడులు..వందల మంది మృతిs
గుండె జబ్బులు వచ్చే రిస్క్..
ఉదయం పూట టిఫిన్ తినకపోతే గుండె పోటు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. సాధారణ వారితో పోలిస్తే బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేసిన వారిలో గుండె జబ్బుల ప్రమాదం రెండు రెట్లు ఎక్కువగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే కొందరికి శరీర భాగాలకు రక్తం, ఆక్సిజన్ అందదు. వీరు తొందరగా చనిపోయే ప్రమాదం కూడా ఉందని నిపుణులు అంటున్నారు.
ఇది కూడా చూడండి: Delhi Railway station : ట్రైన్ల ఆలస్యంతో కిక్కిరిసిన ఢిల్లీ రైల్వే స్టేషన్!
ఉదయం పూట ఏదో ఒకటి తినాలి. టిఫిన్ చేయడం ఇష్టం లేని వారు పండ్లు, ఓట్స్, జ్యూస్ ఇలా ఏదో ఒకటి తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. ఉదయం పూట తినకపోతే బరువు తగ్గడంతో పాటు నీరసం అయిపోతారు. శరీరంలోని రోగనిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోతుంది. రోజంతా నీరసం, అలసటగా అనిపిస్తుంది. రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం పూట తప్పకుండా టిఫిన్ తినాలి. నిజానికి రోజులో ఉదయం పూటే ఎక్కువగా భోజనం చేయాలి. మధ్యాహ్నం, రాత్రి కాస్త తక్కువగా చేయాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు అంటున్నారు.
ఇది కూడా చూడండి: Cinema: రాబిన్ హుడ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో డాన్స్ తో అదరగొట్టిన వార్నర్
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చూడండి: Viral video: ఫోన్‌లో IPL మ్యాచ్ చూస్తూ బస్సు నడిపిన డ్రైవర్.. భారీ జరిమానాతోపాటు..!