/rtv/media/media_files/2025/03/24/uyIFAIhUTHll2vU6q0rz.jpg)
Tea Photograph: (Tea)
Drinking Tea: ఉదయం లేచిన వెంటనే టీ తాగే అలవాటు మనలో చాలా మందికి ఉంటుంది. కొందరు ఒక కప్పుతో సరిపెట్టుకుంటే మరికొందరు మాత్రం రెండు మూడు కప్పులు తాగకుండా ఉండరు. అయితే టీ ఆరోగ్యానికి ఎంత మంచిదో.. అంతే నష్టాన్ని కూడా తీసుకొస్తుంది. లిమిట్‌లోనే టీని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే టీ తాగితే మైండ్ రిఫ్రెష్‌గా ఉంటుంది. యాక్టివ్‌తో రోజంతా ఉంటారు. అలా అని ఎక్కువగా తాగకూడదు. అయితే రోజుకి ఎన్ని కప్పుల టీ తాగితే ఆరోగ్యానికి మంచిదో ఈ ఆర్టికల్‌లో చూద్దాం.
ఇది కూడా చూడండి: USA: యెమెన్ పై అమెరికా దాడులు..వందల మంది మృతిs
ఎక్కువసార్లు టీ తాగితే..
కొందరు రోజుకి నాలుగు, ఐదు సార్లు టీ తాగుతుంటారు. ఇలా ఎక్కువ సార్లు టీ తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు అంటున్నారు. పాల ఉత్పత్తులను ఎక్కువగా తీసుకుంటే అలెర్జీ వస్తుంది. దీనికి బదులు బ్లాక్ టీని తాగినా ఆరోగ్యానికి మంచిదేనని నిపుణులు అంటున్నారు. టీలోని కెఫిన్ శరీరానికి కావాల్సిన పోషకాలను తగ్గిస్తుంది. ఇందులోని షుగర్ మధుమేహం వచ్చేలా చేస్తుంది.
ఇది కూడా చూడండి: Delhi Railway station : ట్రైన్ల ఆలస్యంతో కిక్కిరిసిన ఢిల్లీ రైల్వే స్టేషన్!
అదే బెల్లం వేసుకుని తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవని నిపుణులు చెబుతున్నారు. అయితే చాలా మంది టీని పరగడుపున తాగుతుంటారు. ఇలా తాగడం ఆరోగ్యానికి అసలు మంచిది కాదని నిపుణులు అంటున్నారు. ఏదైనా తిన్న తర్వాతే టీ తాగడం మంచిది. ఇలా తాగితేనే జీర్ణ సమస్యలు రావని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చూడండి: Cinema: రాబిన్ హుడ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో డాన్స్ తో అదరగొట్టిన వార్నర్
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చూడండి: Viral video: ఫోన్‌లో IPL మ్యాచ్ చూస్తూ బస్సు నడిపిన డ్రైవర్.. భారీ జరిమానాతోపాటు..!