Cooling Water: ఎండాకాలంలో కూలింగ్‌ వాటర్‌ తాగితే చనిపోతారా? వైద్యులు ఏం చెబుతున్నారంటే!

చల్లటి నీరు తాగడం వలన కొన్ని సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. అయితే చల్లటి నీరు తాగడం వల్ల ఒక వ్యక్తి చనిపోవడం అనేది చాలా తక్కువ, అరుదైన సందర్భాల్లో జరుగుతుందని తెలుస్తుంది. చల్లటి నీరు ఎక్కువగా తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత బాగా తగ్గుతుంది.

New Update
drinking  cold water

drinking cold water

Cooling Water: మనిషికి నీరు ఎంతో ముఖ్యమైనదనే విషయం తెలిసిందే. అన్నం(Rice) తినకుండా అయినా మనిషి జీవించగలడేమో కానీ, నీరు తాగకుండా మాత్రం ఉండలేడు. సరైన సమయానికి, సరైన మొత్తంలో నీరు తాగితేనే ఆరోగ్యంగా ఉంటాం. నీరు తాగడంలో ప్రతి వ్యక్తికి ఒక్కో రకమైన స్టైల్‌  ఉంటుంది. కొంతమంది గోరువెచ్చని నీరు తాగుతారు, మరికొందరు వేడి నీరు తాగడం ఇష్టపడతారు, ఇంకొంతమంది చల్లటి నీరు తీసుకోవడం ఉత్తమంగా అనుకుంటారు.

Also Read:  Trump: ట్రంప్‌ మరో తలతిక్క నిర్ణయం...ప్రపంచ దేశాలకు విరుద్ధంగా పేపర్‌ వద్దు..ప్లాస్టికే ముద్దంటన్న పెద్దన్న!

అయితే చల్లటి నీరు తాగడం వలన మనిషి చనిపోతాడని పలు కథనాలు చక్కర్లు కొడుతున్నాయి.  చల్లటి నీరు శరీరానికి హానికరం అని పేర్కొంటున్నారు. ఇంతకీ చల్లటి నీరు తాగడం అనేది నిజంగా హానికరమా? చల్లటి నీరు తాగడం వలన ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకుందాం...

Also Read: Singapore: సింగపూర్‌కు ఉగ్రదాడుల ముప్పు.. ప్రజలంతా రెడీగా ఉండాలంటూ మంత్రి వ్యాఖ్యలు!

చల్లటి నీరు తాగడం వలన ఎలాంటి సమస్యలు వస్తాయి?  కొన్ని సందర్భాల్లో చల్లటి నీరు తాగడం వలన కొన్ని సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. అయితే చల్లటి నీరు తాగడం వల్ల ఒక వ్యక్తి చనిపోవడం అనేది చాలా తక్కువ, అరుదైన సందర్భాల్లో జరుగుతుందని తెలుస్తుంది. చల్లటి నీరు ఎక్కువగా తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత బాగా తగ్గుతుంది. ఇది అల్పోష్ణస్థితి,  షాక్‌ను కలిగించే అవకాశం ఉంటుంది. అందుకే గుండె జబ్బులతో బాధపడే వ్యక్తులకు చల్లటి నీరు తీసుకోవడం మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు.

చల్లటి నీరు(Cooling Water) తాగడం వలన..

 అలాగే, చల్లటి నీరు తాగడం వలన కడుపులో అసౌకర్యం, వాంతులు లేదా జీర్ణశయ సంబంధిత సమస్యలు కూడా ఏర్పడతాయని వారు పేర్కొంటున్నారు.ఇతర వైద్యులు కూడా గది ఉష్ణోగ్రత వద్ద ఉండే నీరు లేదా, కొద్దిగా చల్లటి నీరే తాగాలని సూచిస్తున్నారు. శారీరక శ్రమ చేసిన తరువాత చల్లటి నీరు తాగడం అనేది అత్యంత ప్రమాదకరమని, దానిని కచ్చితంగా మానేస్తే మంచిదని చెబుతున్నారు. చల్లటి నీరు తాగిన తర్వాత, మీకు అసౌకర్యం లేదా ఛాతిలో నొప్పి ఉన్నట్లు అనిపిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించి సలహా తీసుకోవాలి.

 చల్లటి నీరు తాగడం వలన మరణం అనేది సంభవించదు. కానీ కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడే వ్యక్తులు ఈ నీటిని తాగడం వల్ల కచ్చితంగా పలు ప్రమాదకర సమస్యలు అయితే వస్తాయి. అందుకే చల్లటి నీరు తాగే విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు, ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Also Read: Flights to Prayagraj: ప్రయాగ్‌రాజ్‌ వెళ్లడం కంటే..లండన్‌,బ్యాంకాక్ ఈజీగా వెళ్లి వచ్చేయోచ్చు!

Also Read: Supreme Court: బస్సు ప్రమాదంలో చనిపోయిన మహిళకు రూ.9 కోట్ల పరిహారాన్ని చెల్లించాల్సిందే

 

Advertisment
Advertisment
Advertisment