/rtv/media/media_files/2025/02/04/walkingrule5.jpeg)
Walking
ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు మన పెద్దలు. ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వ్యాయామం (Exercise), నడక వంటివి తప్పకుండా చేయాలి. అయితే ఈ రోజుల్లో చాలా మంది బద్దకం అయిపోయి.. కనీసం కూడా నడవడం లేదు. రోజుకి కనీసం ఒక కిలోమీటరు దూరం అయినా నడిస్తే ఆరోగ్యానికి బోలెడన్నీ ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కొందరు బరువు తగ్గాలని నడుస్తుంటారు. ఒక్క కిలో మీటరు నడక వల్ల బరువు మాత్రమే తగ్గకుండా.. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చూడండి: Uttarakhand:హీరోయిన్‌ను చేస్తామని.. మాజీ సీఎం కుమార్తెనే మోసం చేశారు!
గుండె పోటు రాదు
రోజూ ఒక కిలో మీటరు నడవడం (Walking) వల్ల గుండె పోటు వచ్చే ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. నడిస్తే రక్తప్రసరణ మెరుగుపడుతుంది. దీంతో గుండె పోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
ఇది కూడా చూడండి: Delhi: ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠం పై మగువ...బీజేపీ పెద్ద ప్లానే...నలుగురు ఎమ్మెల్యేలకు అవకాశం...!
బరువు తగ్గుదల
డైలీ నడవడం వల్ల శరీరంలోని కేలరీలు బర్న్ అవుతాయి. దీంతో జీవక్రియ రేటు పెరుగుతుంది. దీనివల్ల శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ అంతా కూడా తగ్గుతుంది.
ఇది కూడా చూడండి: Maha Kumbh mela: మహా కుంభమేళాకు భారీగా తరలి వచ్చిన భక్తులు...కాశీలోనే ఆంక్షలు విధించిన అధికారులు!
మానసిక ఆరోగ్యం
నడక వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. మెదడు పనితీరు కూడా బాగా మెరుగుపడుతుంది. ఎలాంటి మానసిక సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు.
జీర్ణ సమస్యలు
కొందరు ఎక్కువగా జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు తిన్న వెంటనే నడవడం వల్ల జీర్ణ సమస్యల నుంచి విముక్తి పొందుతారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.