/rtv/media/media_files/2025/02/07/brain2.jpeg)
Brain
బ్రెయిన్ షార్ప్‌గా ఉండాలంటే తప్పకుండా కొన్ని నియమాలు పాటిస్తుండాలి. కొత్త కొత్త ఆలోచనలు రావాలంటే బ్రెయిన్‌కి కూడా అప్పుడప్పుడు పదును పెట్టాలి. ఎప్పుడు ఖాళీగా ఉండకుండా కొత్త విషయాలు నేర్చుకోవాలి. కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం వల్ల బ్రెయిన్ బాగా షార్ప్ అవుతుంది. మీకు వచ్చిన పనులు కాకుండా రాని వాటిని నేర్చుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. అలాగే చెస్, పజిల్స్, క్యూబ్స్ వంటివి చేయడం వల్ల కూడా లాజిక్స్ తెలుస్తాయి.
ఇది కూడా చూడండి: You Tube: యూట్యూబ్ నుంచి 95లక్షల వీడియోలు, 45 లక్షల ఛానెళ్ళు తొలగింపు
పోషకాలు ఉండే ఫుడ్ తీసుకోవడం వల్ల..
ప్రతీ విషయంలో మీరు కొత్తగా ఆలోచించగలుగుతారు. మెదడు పనితీరు మెరుగుపడాలంటే మనిషికి నిద్ర కూడా ముఖ్యమే. బాడీకి సరిపడా నిద్రపోవడం వల్ల జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుంది. అలాగే ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా దరిచేరవు. మనం తీసుకునే ఫుడ్ ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. పోషకాలు ఉండే ఫుడ్‌ను తీసుకోవడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. దీంతో బ్రెయిన్ పనితీరు మందగించకుండా పవర్ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే వ్యాయామం, యోగా, మెడిటేషన్ వంటివి చేయడం వల్ల కూడా బ్రెయిన్ పనితీరు మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. రోజులో ఒక 15 నిమిషాలు అయినా వ్యాయామం లేదా యోగా వంటివి చేయడం అలవాటు చేసుకోండి.
ఇది కూడా చూడండి: AP News: మగవారికంటే మహిళలే మెరుగ్గా రానిస్తున్నారు.. చంద్రబాబు సంచలన కామెంట్స్!
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.