Coliform Bacteria: కుంభమేళాలో జాగ్రత్త.. మల కోలిఫాం బ్యాక్టీరియా ఎంత డేంజరస్‌ అంటే..!

కుంభమేళా త్రివేణి సంగమ జలాల్లో కోలిఫాం బ్యాక్టీరియా ఉందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నివేధికలో పేర్కొంది. కోలిఫాం బ్యాక్టీరియా జంతువులు, మానవుల ప్రేగులలోని మలం నుండి ఉత్పత్తి అవుతుంది. స్నానం చేయడానికి ఈ నీరు మంచిది కాదు.. అనారోగ్యం పాలైతాము.

New Update
Coliform bacteria

Coliform bacteria Photograph: (Coliform bacteria)

ప్రయాగ్‌రాజ్ (Prayagraj) కుంభమేళా (Kumbh Mela) లో నీళ్లు స్నానం చేయడానికి పనికిరానివని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే. అందులో కోలిఫాం బ్యాక్టీరియా విపరీతంగా ఉందని పొల్యుషన్ కంట్రోల్ బోర్డ్ నివేదికలో పేర్కొంది. కోలిఫాం బ్యాక్టీరియా వెచ్చని రక్త కలిగిన జంతువులు, మానవుల ప్రేగులలో కనిపిస్తుంది. ఇవి సాధారణంగా నీటిలో కాలుష్యానికి సూచికలుగా పరిగణించబడతాయి.

Also Read :  కుంభమేళాలో జాగ్రత్త.. మల కోలిఫాం బ్యాక్టీరియా ఎంత డేంజరస్‌ అంటే..!

కోలిఫాం బ్యాక్టీరియా నీటిలో ఉందంటే వాటితోపాటు వైరస్‌లు, పరాన్నజీవులు లేదా ఇతర బ్యాక్టీరియా వంటి హానికరమైన సూక్ష్మక్రిములు కూడా ఉండవచ్చు. కోలిఫాం బ్యాక్టీరియా జంతువులు, మానవుల ప్రేగులలోని మలం నుండి ఉత్పత్తి అవుతుంది. నీటి శుభ్రంగా ఉన్నాయా లేదా అని తెలిసుకోడానికి మల కోలిఫాం పరీక్ష తరచుగా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ కోలిఫాం బ్యాక్టీరియా ఉన్న నీరు త్రాగడానికి, స్నానం చేయడానికి ఇతర కార్యకలాపాలకు సురక్షితం కాదని డాక్టర్లు చెబుతున్ననారు. ఈ బ్యాక్టీరియా మన శరీరంలోకి ప్రవేశిస్తే.. అనారోగ్యం పాలైతాము.

Also Read: China: చైనా దుందుడుకు చర్య..ఫిలిప్పీన్స్ విమానాన్ని గుద్దేస్తామంటూ ఆట్లాట

Also Read :  మొదటి మ్యాచ్ లోనే చిత్తు అయిన ఆతిథ్య జట్టు..

ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయ్..

కోలిఫాం కాలుష్యం అనేది మల కోలిఫాం బ్యాక్టీరియా వల్ల సంభవిస్తుంది. ఇది తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తుంది. ఈ బ్యాక్టీరియా వికారం, వాంతులు, విరేచనాలు, మరింత తీవ్రమైన ఇన్ఫెక్షన్లతో సహా అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. ప్రధానంగా శుద్ధి చేయని మురుగునీటి కారణంగా నది మల కోలిఫాం బ్యాక్టీరియాతో అధికంగా కలుషితమైందని CPCB నివేదించింది. ఈ కలుషితమైన నీటిని తాగడం వల్ల జీర్ణవ్యవస్థలో ఇన్ఫెక్షన్లు, చర్మపు దద్దుర్లు, కంటి చికాకు, టైఫాయిడ్, హెపటైటిస్ ఎ వంటి తీవ్రమైన వ్యాధులు వంటి అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. ప్రస్తుతం జరుగుతున్న మహా కుంభమేళాలో స్నానం చేసే త్రివేణి సంగమం జలాల్లో మల కోలిఫాం బ్యాక్టీరియా 100 మి.లీ నీటిలో 2,500 యూనిట్ల ఉన్నాయని పొల్యుషన్ కంట్రోల్ బోర్ట్ తెలిపింది. నదిలోకి స్నానం చేసే వారికి ఇది చాలా ప్రమాదకరమని CPCB నివేదికలు చూపిస్తున్నాయి. దీని కారణంగా, ప్రయాగ్‌రాజ్‌కు లక్షలాది మంది యాత్రికులు రావడం వల్ల నీటి ద్వారా వచ్చే వ్యాధుల ప్రమాదం గణనీయంగా పెరిగింది.

Also Read :  శరీరం పై ఈ గుర్తులు కనపడతున్నాయా..అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు