BREAKING: తెలంగాణలో వడదెబ్బతో 34 మంది మృతి
తెలంగాణలో ఎండల తీవ్రత భయాందోళన రేపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బ తగిలి ఇప్పటివరకు 34 మంది మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. దాదాపు 20 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్ దాటాయి.
తెలంగాణలో ఎండల తీవ్రత భయాందోళన రేపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బ తగిలి ఇప్పటివరకు 34 మంది మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. దాదాపు 20 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్ దాటాయి.
రామ్ చరణ్ 'పెద్ది' సినిమాకు బజ్ పెంచేందుకు భోపాల్‌లో ఏఆర్ రెహమాన్‌తో రూ.4 కోట్ల భారీ లైవ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. గ్రామీణ భావోద్వేగాలతో తెరకెక్కుతున్న ఈ కథ తన నేల, సంస్కృతిని గుర్తు చేసిందని రామ్ చరణ్ తెలిపారు. ఈ సినిమా జూన్ 4న విడుదల కానుంది.
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు లీటర్ పెట్రోల్‌పై 87 పైసలు, డీజిల్‌పై 91 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.
తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా గుర్తింపు పొందిన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రాన్ని రేపు సీఎం రేవంత్ రెడ్డి సందర్శిస్తారు. సుమారు రూ.100 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఐదు అభివృద్ధి పనులకు సీఎం భూమిపూజలు, శంకుస్థాపనలు చేస్తారు.
టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ మహిళా సెలబ్రిటీలు అనసూయ, విష్ణుప్రియ సోషల్ మీడియా వేధింపులు, అసత్య ప్రచారాలపై పోలీసులను ఆశ్రయించారు. మహిళా సెలబ్రిటీలపై జరుగుతున్న ఆన్లైన్ దుష్ప్రచారం, ట్రోలింగ్, వ్యక్తిత్వ హననంపై వారు ఫిర్యాదు చేశారు.
రాష్ట్ర రాజధానికి సమీపంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న శంషాబాద్ మండలంలోని పెద్ద షాపూర్ ప్రాంతంలో ప్రభుత్వ భూముల కేటాయింపుపై తీవ్ర వివాదం నెలకొంది. రూ.కోట్లు విలువ చేసే భూమిని స్థానిక తహసీల్దార్ ఒక ప్రైవేటు వర్గానికి అనుకూలంగా కేటాయించినట్లు సమాచారం.
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులకు ముఖ్యమైన హెచ్చరిక. ఈ నెల 25, 26 తేదీల్లో ఎస్బీఐ ఉద్యోగులు దేశవ్యాప్తంగా సమ్మెకు దిగనున్నారు. వారాంతపు ,పండుగ సెలవులతో కలుపుకుని వరుసగా ఐదు రోజలు బ్యాంకులు పనిచేయవు.
గతేడాది అందాల పోటీల్లో 'మిస్ వెనెజువెలా 2025' కిరీటాన్ని దక్కించుకున్న ప్రముఖ మోడల్ ఆండ్రియా డెల్ వాల్ (Andrea del Val) పై ఆమె సొంత సెలబ్రిటీ స్టైలిస్ట్ లగూనా (Laguna) కత్తెరతో భీకరంగా దాడికి తెగబడ్డాడు. కేన్స్‌లోని ఒక హోటల్ గదిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విద్యా వర్గాలలో ఒక ఊహించని పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) కి అందజేశారు.