Asteroid 2024 YR4: అదే డిసెంబర్‌ 22.. అదే భయం.. భూమికి ముప్పుగా మారుతున్న ఖగోళ భూతం!

డిసెంబర్ 22, 2032న మన చంద్రునికి అత్యంత సమీపంగా ఓ గ్రహశకలం రానుంది. ఈ శకలం వాయుమండలాన్ని చీల్చుకుంటూ ప్రవేశిస్తే, ఎట్మాస్ఫెరిక్ ఎక్స్‌ప్లోషన్ అనే భయంకరమైన సంఘటన జరుగుతుందని ఖగోళశాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

New Update
earth

earth

Asteroid 2024 YR4: నక్షత్రాల నడుమ వెలుగుతున్న ఓ మహా ప్రళయ రాయి భూమి వైపు దూసుకొస్తోంది! ఇది ఏ సాధారణ ఘటనా కాదని, భూమిని వణికించే ఘోర విపత్తుకు తెరతీస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. "2024 YR4.." ఇది మామూలు గ్రహశకలం కాదు.. భూగోళాన్ని చీల్చివేయగల శక్తితో, ఇది అంతరిక్షం నుంచి భూమి వైపు నిశ్శబ్దంగా ప్రయాణిస్తోంది. 2032 డిసెంబర్‌లో, ఇది భూమిని ఢీకొట్టే(Asteroid Hitting Earth) అవకాశం 1:83 నిష్పత్తిలో ఉంది. ఇది చిన్న అవకాశం అనిపించవచ్చు. కానీ,  అంతరిక్షంలో చిన్న మార్పులే విపరీతమైన పరిణామాలకు దారితీస్తాయని ఖగోళశాస్త్రవేత్తలు చెబుతున్నారు. 27 మిలియన్ మైళ్ల దూరంలో ఉన్న ఈ శకలం భూమికి అత్యంత సమీపంగా 1,06,200 కిలోమీటర్ల దూరం వరకు వస్తుందని అంచనా. చంద్రుడి(Moon) కంటే కూడా సమీపంగా రాబోతుందట. 

Also Read: Daaku Maharaaj: దబిడి దిబిడే.. ఓటీటీలోకి బాలయ్య డాకు మహారాజ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ప్రళయం?

ఈ శకలం వాయుమండలాన్ని చీల్చుకుంటూ ప్రవేశిస్తే, ఎట్మాస్ఫెరిక్ ఎక్స్‌ప్లోషన్ అనే భయంకరమైన సంఘటన జరుగుతుంది. దీనిని "ఎయిర్‌బస్ట్" అని అంటారు. 2013లో రష్యాలోని(Russia) చెలియాబిన్స్క్ నగరంపై ఓ చిన్న గ్రహశకలం పేలినప్పుడు, ఆ ప్రభావంతో వేల కిలోమీటర్ల మేర భవనాల అద్దాలు పగిలిపోయాయి. ఇక ఈ 2024 YR4 అయితే? దాని పరిమాణాన్ని బట్టి, భూమిపై పడితే క్షణాల్లో నగరాలు మట్టిలో కలిసిపోతాయా?

Also Read: Suryapet Murder: చంపింది నాన్నమ్మనే.. ప్రైవేట్‌ పార్ట్స్‌ను కసితీరా తొక్కి.. భార్గవి సంచలన నిజాలు!

నాసా శాస్త్రవేత్తలు అప్రమత్తం

NASA 'సెంటర్ ఫర్ నీర్ ఎర్త్ ఆబ్జెక్ట్ స్టడీస్' (CNEOS) ఇప్పటికే దీని కదలికలపై నిఘా పెట్టింది. ఇది భూమిని ఢీకొట్టకపోయినా, డిసెంబర్ 22, 2032న మన చంద్రునికి అత్యంత సమీపంగా వెళ్లనుంది. కానీ ఖగోళ నిపుణుల మాట ప్రకారం, కేవలం చిన్న మార్పుతో కూడా  దాని గమ్యం మారిపోవచ్చని చెబుతున్నారు. ఇక మన శాస్త్రవేత్తలు కొత్త పరిష్కారాన్ని కనుగొని భూమిని రక్షిస్తారా? లేదా ఈ ఘటన ఓ నూతన యుగానికి తెరతీస్తుందా? చూడాలి. 

Also Read: Double ISMART: తెలుగులో ఫ్లాప్.. హిందీలో 100 మిలియన్ల వ్యూస్.. యూట్యూబ్ లో డబుల్ ఇస్మార్ట్ సర్ప్రైజ్!

Also Read:  జూ.ఎన్టీఆర్ను మళ్లీ అవమానించిన బాలయ్య.. ఫొటోలు వైరల్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Hebah Patel చీరలో వావ్ ! అనిపిస్తున్న హెబ్బా.. ఫొటోలు చూశారా

నటి హెబ్బా పటేల్ సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలు షేర్ చేసింది. అందమైన చీరకట్టులో హెబ్బా అందాలు ఫిదా చేస్తున్నాయి. ఈ ఫొటోలు మీరు కూడా చూసేయండి.

New Update
Advertisment
Advertisment
Advertisment