🔴Live News Updates: మహా కుంభమేళాకు 50 కోట్ల మంది భక్తులు.. యూపీ సర్కార్ సంచలన ప్రకటన
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలను ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చుడండి.
Feb 14, 2025 21:13 IST
Maha Kumbh Mela: మహా కుంభమేళాకు 50 కోట్ల మంది భక్తులు.. యూపీ సర్కార్ సంచలన ప్రకటన
మహా కుంభమేళాకు వచ్చేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి శుక్రవారం సాయంత్రం వరకు 50 కోట్లకు పైగా భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించినట్లు యూపీ సర్కార్ తెలిపింది.
Maha Kumbhmela 2025
Feb 14, 2025 11:13 IST
Crime News: లవర్స్ డే రోజునే దారుణం.. ప్రేమించలేదని యువతిపై యాసిడ్ దాడి!
ప్రేమికుల దినోత్సవం రోజునే దారుణం జరిగింది. తన ప్రేమను అంగీకరించలేదని ఓ యువతిపై యాసిడ్ తో దాడి చేశాడు ఓ దుర్మార్గుడు. ఈ ఘటన ఏపీలో చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
atack on lover
Feb 14, 2025 09:58 IST
USA: వారిని పంపించేడమే కరెక్ట్..ట్రంప్ సరిగ్గానే చేస్తున్నారు- మోదీ
ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈరోజు భేటీ అయ్యారు. ఈ సందర్బంగా అక్రమ వలసల గురించి మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. మానవ అక్రమ రవాణాను అంతం చేయడానికి ప్రయత్నాలు అవసరమని ఆయన అన్నారు.
టాలీవుడ్ నటుడు మోహన్‌బాబు బౌన్సర్లు రెచ్చిపోయారు. తిరుపతిలోని మోహన్‌బాబు యూనివర్సిటీ ఎదురుగా ఉన్న F5 రెస్టారెంట్ అద్దాలు, ఫర్నీచర్ లను ధ్వంసం చేశారు. అయితే దీనిపై తమకెలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెబుతున్నారు.
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ జియో సినిమా, డిస్నీప్లస్ హాట్ స్టార్ విలీనం పూర్తైంది. ఈ యాప్కు జియో హాట్ స్టార్ అని పేరు పెట్టారు. ఈ రెండు యాప్స్ ఒకే గూటి కిందకు చేరడంతో జియోహాట్ స్టార్ అతిపెద్ద ఓటీటీ ప్లాట్ ఫామ్ గా అవతరించింది.
jio Hotstar
Feb 14, 2025 08:09 IST
Fastag: ఫాస్టాగ్ యూజర్లకు అలర్ట్..ఫిబ్రవరి 17 నుంచి కొత్త రూల్స్!
ఫాస్టాగ్ లావాదేవీలకు సంబంధించి కొత్త నిబంధనలు తీసుకుని వచ్చింది. వినియోగదారులకు కొత్తగా 70 నిమిషాల వ్యవధిని నిర్దేశించింది.ఈ సమయంలో బ్లాక్ లిస్ట్ లో నుంచి వైదొలగడంలో విఫలమైతే డబుల్ ఫీజు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
Fastag
Feb 14, 2025 07:46 IST
Breaking News : తెలుగు దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి తండ్రి కన్నుమూత!
తెలుగు దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి సుబ్బారావు తుదిశ్వాస విడిచారు. 75 ఏళ్ల వయసులో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కన్నుమూశారు. సుబ్బారావు స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా తుని మండలంలోని రేఖవానిపాలెం గ్రామం.
Feb 14, 2025 07:38 IST
Telangana: తెలంగాణ అప్పుల్లో కూరుకుపోయిన విషయం నిజమే..నిర్మలా సీతారామన్!
కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రంపై వివక్ష చూపట్లేదని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో చెప్పారుతన ప్రసంగాన్ని అడ్డుకున్న తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలను ఉద్దేశించి లెక్కలతో సహా తెలంగాణకు నిధుల కేటాయింపులను వివరించారు.