🔴Live News: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్- JNTUలో జాబ్ మేళా.. రూ.6 లక్షల వరకు జీతం!

author-image
By Manoj Varma
New Update
BREAKING NEWS

breaking news

  • Feb 25, 2025 10:29 IST

    నిరుద్యోగులకు గుడ్‌న్యూస్- JNTUలో జాబ్ మేళా.. రూ.6 లక్షల వరకు జీతం!

    కూకట్ పల్లి జేఎన్టీయూ గుడ్ న్యూస్ చెప్పింది. జేఎన్టీయూ యూనివర్సిటీలో మార్చి 1వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహించనుంది. దీని ద్వారా వెయ్యికి పైగా జాబ్స్ దక్కనున్నాయి. జాబ్స్‌కు సెలెక్ట్ అయితే రూ.1.08 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు ప్యాకేజీ అందుకోవచ్చు.

    JOB MELA 2025
    JOB MELA 2025 Photograph: (JOB MELA 2025)

     



  • Feb 25, 2025 08:43 IST

    పంటపోలాల్లో నోట్ల కట్టల కలకలం.. బ్యాంక్ పేరు చూసి కంగుతిన్న పోలీసులు!

    నల్గొండ జిల్లా పంటపొలంలో నోట్ల కట్టలు కలకలం రేపాయి. బొత్తలపాలెం వద్ద ఓ రైతు పొలంలో రూ.500 నోట్లతో కూడిన 50 కట్టలు దర్శమిచ్చాయి. పోలీసులకు సమాచారం అందించగా వాటిని పరిశీలించిన సీఐ వీరబాబు ‘చిల్డ్రన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’ నకిలీ నోట్లుగా తెలిపారు. 

    fake notes
    fake notes Photograph: (fake notes)

     



  • Feb 25, 2025 08:05 IST

    టాప్‌-10లో హైదరాబాద్‌ చారిత్రక ప్రదేశాలు.. అత్యధిక పర్యాటకుల సందర్శనతో రికార్డు!

    భాగ్యనగరం మరోసారి తన ఘనత చాటుకుంది. భారత పురావస్తు శాఖ విడుదల చేసిన దేశంలోనే అత్యధిక పర్యాటకులు సందర్శించిన చారిత్రక ప్రదేశాల జాబితాలో గోల్కొండ కోట (6), చార్మినార్‌ (10) చోటు దక్కించుకున్నాయి. తాజ్‌మహల్‌ అగ్రస్థానంలో నిలిచింది.

    hyderabad  forts
    hyderabad forts Photograph: (hyderabad forts)

     



  • Feb 25, 2025 08:03 IST

    ఏనుగుల దాడిలో నలుగురు మృతి

    అన్నమయ్య జిల్లా రైల్వే కొండూరులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దేవాలయానికి వెళ్తున్న భక్తులను ఏనుగులు తొక్కి చంపాయి. ఓబులవారిపల్లి గ్రామం సమీపంలోని నీలకంఠేశ్వర ఆలయానికి వెళ్తుండగా వైకోట అటవి ప్రాంతంలో ఏనుగులు వారిపై దాడి చేశాయి.

    Elephant rampage Kerala temple festival
    Elephant rampage Kerala temple festival Photograph: (Elephant rampage Kerala temple festival)

     



  • Feb 25, 2025 08:03 IST

    తెలంగాణ లాసెట్ 2025 షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలివే

    తెలంగాణల లాసెట్, పీజీఎల్ సెట్ 2025 షెడ్యూల్ విడుదలైంది. మార్చి 1 నుంచి ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఏప్రిల్ 15, 2025వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. జూన్ 6వ తేదీన ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు.

    telangana TS LAWCET, PGLCET 2025 schedule released
    telangana TS LAWCET, PGLCET 2025 schedule released Photograph: (telangana TS LAWCET, PGLCET 2025 schedule released)

     



  • Feb 25, 2025 08:02 IST

    ఫ్యామిలీ మొత్తాన్ని చంపి.. పోలీసులకు లొంగిపోయిన యువకుడు

    కేరళలోని తిరువనంతపురంలో అఫాన్ (23) కుటుంబసభ్యులందరినీ కిరాతకంగా హత్య చేసి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. అఫాన్ అతని తమ్ముడు, అమ్మమ్మ, అత్త, మామ, గర్ల్ ఫ్రెండ్‌ లను హత్య చేశాడు. తల్లిపై దాడి చేయగా.. ఆమె హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటుంది.

    kerala crime
    kerala crime Photograph: (kerala crime)

     



  • Feb 25, 2025 08:01 IST

    ‘అమ్మాయిలు కావాలంటే ఈ నంబర్‌కు ఫోన్ చేయండి’.. ఎంత పని చేశావ్‌రా దుర్మార్గుడా!

    పల్నాడుకు చెందిన 31ఏళ్ల నాగరాజు 13ఏళ్ల బాలికను లోబర్చుకుని ఇద్దరు పిల్లల తల్లిని చేశాడు. బాలిక తల్లిదండ్రుల మిస్సింగ్ ఫిర్యాదుతో పోలీసులు ఆమెను పట్టుకున్నారు. కోపంతో నాగరాజు అమ్మాయిలు కావాలంటే ఈ నంబర్‌కు ఫోన్ చేయండి అంటూ ట్రైన్ బోగీలపై బాలిక నంబర్ రాశాడు.

    Palnadu man Nagaraj made 13 year old girl mother of two children
    Palnadu man Nagaraj made 13 year old girl mother of two children Photograph: (Palnadu man Nagaraj made 13 year old girl mother of two children)

     



  • Feb 25, 2025 08:00 IST

    వ్యభిచారం వీడియోలు ఎందుకు బయటపెట్టారు.. పోలీసులపై వైసీపీ నేత ఆగ్రహం!

    విజయవాడ వ్యభిచారం కేసులో తన వీడియోలు విడుదల చేసిన పోలీసులపై వైసీపీ నేత శంకర్ నాయక్  ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 'పోలీసులు తీరు వల్ల నా కుటుంబం రోడ్డున పడింది. నా భార్య సూసైడ్ చేసుకుంటానంటోంది. మీ అంతు చూస్తా' అని వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. 

     



  • Feb 25, 2025 07:59 IST

    కోల్‌కతాలో భారీ భూకంపం



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు