HYDRAA Jobs: హైడ్రాలో 357 ఉద్యోగాలు.. ఆ మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక!
హైడ్రాకు సంబంధించిన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) విభాగంలో కొత్తగా 357 ని నియమించారు. పోలీస్ నియామక పరీక్షల్లో కొద్ది మార్కులతో ఉద్యోగం కోల్పోయిన వారిని మెరిట్ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేశారు. హైడ్రా చీఫ్ రంగనాథ్ ఈ రోజు వీరి శిక్షణను ప్రారంభించారు.
HYDRAA New Jobs
Feb 20, 2025 09:54 IST
అబ్బే బర్డ్ ఫ్లూను పట్టించుకోవట్లే..భారీగా పెరిగిన చికెన్ ధరలు
చికెన్ ధరలకు మళ్ళీ రెక్కలొచ్చాయి. పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డా. దామోదర బర్డ్ ఫ్లూ పూర్తిగా అదుపులో ఉన్నట్లు వెల్లడించారు. దీంతో ధరలు మళ్ళీ పెరిగాయి. ఈరోజు చికెన్ ధరలు KG స్కిన్లెస్ రూ. 200, విత్ స్కిన్ రూ. 180గా ఉన్నాయి.
Feb 20, 2025 09:23 IST
తుంగభద్ర నదిలో కొట్టుకుపోయిన మహిళా డాక్టర్
హైదరాబాద్‌కి చెందిన అనన్యరావు మోహన్‌రావు అనే వైద్యురాలు తన స్నేహితులతో కలిసి కర్ణాటక కు విహారయాత్రకు వెళ్లారు. అక్కడ అనన్య ఈత కొట్టాలని తుంగభద్ర నదిలోకి దూకింది.ఈ క్రమంలో నీటి ఉధృతికి ఆమె కొట్టుకుపోయింది.
karnataka
Feb 20, 2025 08:10 IST
రేప్‌లు చేసి బయటకొచ్చి.. మళ్లీ రేప్ చేశాడు... చివరకు కుంభమేళాకు వెళ్తుండగా
రమేశ్ సింగ్ ఓ సీరియల్ రేపిస్ట్.. 2003, 2014లో ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారం చేశాడు. జైలు శిక్ష కూడా అనుభవించాడు. అయిన బుద్ది రాలేదు. ఫిబ్రవరి 1వ తేదీన ఓ 11 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి చంపి కుంభమేళాకు వెళ్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు.
Feb 20, 2025 07:52 IST
ఏపీ విద్యార్థులకు మంత్రి లోకేష్ అదిరిపోయే వార్త.. అకౌంట్‌లలోకి డబ్బులు!
మంత్రి నారా లోకేష్ తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా యూనివర్శిటీలో పర్యటించారు.ఈ క్రమంలో ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన అంశంపై కీలక ప్రకటన చేశారు. ఇకపై సెమిస్టర్ వారీగా డబ్బుల్ని విడుదల చేస్తామన్నారు.
Nara-Lokesh
Feb 20, 2025 07:51 IST
బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. 5 వేల 540 పైగా కోళ్లు మృతి.. రూ.500 కోట్ల నష్టం!
బర్డ్ ఫ్లూ వైరస్ ఎఫెక్ట్ ఫౌల్ట్రీ పరిశ్రమపై గట్టిగానే పడింది. కోళ్ల మృత్యువాత పడుతున్నాయి. దీంతో జనాలు భయపడిపోయి చికెన్, గుడ్లు తినడం లేదు. వనపర్తి జిల్లాలో 5,540 కోళ్లు మృత్యువాత పడగా.. నెలలో రూ.500 కోట్ల నష్టం వాటిల్లినట్లు రైతులు చెబుతున్నారు.
Feb 20, 2025 07:50 IST
రాజకీయ పార్టీలకు సీఎం రేవంత్ రెడ్డి లేఖ.. ఐదురోజులపాటు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణలో మార్చి మొదటి వారం 5 రోజులపాటు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. CM రేవంత్ రెడ్డి BC రిజర్వేషన్, SC వర్గీకరణపై చట్టాలు చేయడానికి త్వరలో అన్నీ రాజకీయ పార్టీలకు లేఖలు రాయనున్నారు. మార్చి 10 ఆయనతోపాటు పలువురు కీలక నేతలు ఢిల్లీ వెళ్లనున్నారు.
CM Revanth Reddy
Feb 20, 2025 07:49 IST
మేము ఏ జట్టునైనా ఓడించగలము...బంగ్లా కెప్టెన్
ఛాంపియన్స్ ట్రోఫీ మొదలైంది. నిన్న పాకిస్తాన్, న్యూజిలాండ్ మ్యాచ్ లో ఆతిథ్య జట్టు ఓడిపోయింది. ఈరోజు భారత్-బంగ్లాదేశ్ ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో తాము ఎంత బలమైన జట్టునైనా ఓడించగలము అంటూ కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ హెచ్చరించాడు.
Bangladesh Captain Najmul Hossain
Feb 20, 2025 07:49 IST
నేడు బంగ్లాదేశ్‌తో టీమిండియా మ్యాచ్.. అన్ని రికార్డుల్లో మనమే టాప్ !
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా టీమిండియా తన తొలి మ్యాచ్ను నేడు బంగ్లాదేశ్‌తో ఆడనుంది. రోహిత్ శర్మ కెప్టెన్సీలోని భారత జట్టు ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన ఊపు మీద ఉంది. అలాంటిది బంగ్లాపై గెలుపు పెద్దగా కష్టమేమీ కాకపోవచ్చు.