USA: తాను గెలిస్తే...వాళ్ళని దేశం నుంచి వెళ్ళగొడతా-ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా తాను గెలిస్తే దేశ చరిత్రలోనే అతి పెద్ద బహిష్కరణ చేపడతానని అన్నారు డొనాల్డ్ ట్రంప్. తనకు ఓటు వేస్తే రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదులను దేశం నుంచి వెళ్ళగొడతానని చెప్పారు. By Manogna alamuru 17 Jun 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Donald Trump: అమెరికా ఎప్పుడూ లేనంతగా ప్రమాదంలో పడిందని అంటున్నారు డొనాల్డ్ ట్రంప్. వేలాది మంది ఉగ్రవాదులు ఇక్కడకు ప్రవేశిస్తున్నారు. ఇది చాలా అసాయకరమైన పరిస్థితని ఆయన అన్నారు. తనకు ఓటు వేస్తే వాళ్ళందరినీ అమెరికా నుంచి తరిమేస్తానని మిషిగాన్‌లో నిర్వహించిన ప్రచారంలో వ్యాఖ్యానించారు. ఐసిస్‌తో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న ఎనిమిది మందిని అమెరికా అధికారులు శనివారం అరెస్టు చేసిన నేపథ్యంలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అమెరికన్ ఓటర్లకు ఛాయిస్ ఉంది. రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదులను దేశంలోకి అనుమతిస్తున్న అధ్యక్షుడు కావాలా? వారిని దేశం నుంచి తరిమేసే అధ్యక్షుడు కావాలా అని అడిగారు డొనాల్డ్ ట్రంప్. తాను కనుక గెలిస్తే అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి రోజు నుంచే దేశ చరిత్రలో అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్‌ను మొదలుపెడతానన్నారు. అమెరికాను ఉగ్రవాదం నుంచి రక్షించాలంటే ఇలా చేయడం తప్ప మరో మార్గం లేదని చెప్పారు. Also Read:Hajj: సౌదీ అరేబియాలో అదరగొడుతున్న ఎండలు..14మంది హజ్ యాత్రికులు మృతి #elections #usa #donald-trump #terrorists #radical-muslims మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి