Pawan Kalyan : పవన్‌ స్పెషల్ ఆఫీసర్ ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ(ఓఎస్‌డీ)గా, కేరళలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యంగ్ ఐఏఎస్‌ అధికారి మైలవరపు వీఆర్‌ కృష్ణతేజ రానున్నారు.ఐఏఎస్‌ అధికారి అయిన కృష్ణతేజ నియామకానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక అనుమతి ఇచ్చారు.

New Update
Pawan Kalyan : పవన్‌ స్పెషల్ ఆఫీసర్  ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

Pawan Kalyan Special Officer : ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ(ఓఎస్‌డీ)గా, కేరళ (Kerala) లో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) కు చెందిన యంగ్ ఐఏఎస్‌ అధికారి మైలవరపు వీఆర్‌ కృష్ణతేజ రానున్నారు. సాధారణంగా ఆర్‌డీఓ స్థాయి అధికారులను మంత్రులకు ఓఎస్‌డీలుగా నియమిస్తారు. అయితే పవన్‌కల్యాణ్‌ కోసం.. ఐఏఎస్‌ అధికారి అయిన కృష్ణతేజ నియామకానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) ప్రత్యేక అనుమతి ఇచ్చారు. ప్రస్తుతం కేరళలోని త్రిసూర్‌ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఆయనను, డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి పంపాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.

కృష్ణతేజ గతంలో కేరళ పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ, పర్యాటకశాఖ డైరెక్టర్, ఎస్సీ అభివృద్ధిశాఖ డైరెక్టర్, అలప్పుజ జిల్లా కలెక్టర్‌గా సేవలందించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన కృష్ణతేజ, రెండు రోజుల కిందట సచివాలయంలో పవన్‌కల్యాణ్‌ను కలిశారు.త్రిసూర్‌ జిల్లా కలెక్టర్‌గా కృష్ణతేజ అందించిన సేవలకు గాను, జాతీయ బాలల రక్షణ కమిషన్‌ ఆయనను పురస్కారానికి ఎంపిక చేసింది. బాలల హక్కుల సంరక్షణలో కేరళలోని త్రిసూర్‌ జిల్లాను, ఆయన దేశంలోనే ముందు స్థానంలో నిలిపారు. 2015 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన కృష్ణతేజ.. 2023 మార్చిలో కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు.

కరోనా (Corona) కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన 609 మంది విద్యార్థులను గుర్తించి.. దాతల సహకారంతో ఉన్నత చదువులకు చేయూత అందించారు. కరోనా సమయంలో భర్తలను పోగొట్టుకున్న 35 మంది వితంతువులకు ఇళ్లు నిర్మించడంతోపాటు, 150మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. ఐఏఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆయన అద్భుత పనితీరుతో తనదైన ముద్ర వేస్తున్నారు.

Also read: నేడు, రేపు ఏపీలో అసెంబ్లీ సమావేశాలు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: పవన్ కల్యాణ్ కు తీవ్ర అనారోగ్యం.. కేబినెట్ మీటింగ్ మధ్యలోనే బయటకు..!

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. కేబినెట్ల సమావేశం కోసం హైదరాబాద్ నుంచి ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆయన సచివాలయానికి వచ్చారు. అయితే.. అనారోగ్య కారణంతో ఆయన తిరిగి వెళ్లిపోయారు. 

New Update
Pawan Kalyan Health Issues

Pawan Kalyan Health Issues

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. కేబినెట్ సమావేశం కోసం హైదరాబాద్ నుంచి ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆయన సచివాలయానికి వచ్చారు. అయితే.. అనారోగ్య కారణంతో ఆయన తిరిగి వెళ్లిపోయారు. 

Advertisment
Advertisment
Advertisment