West Bengal : ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం.. నిందితుడికి నాలుగు పెళ్లిళ్లు కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం చేసిన నిందితుడు సంజయ్ రాయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతడికి నాలుగు పెళ్లిళ్లు అయినట్లు విచారణలో తేలింది. నిందితుడి దుష్ప్రవర్తన వల్లే ముగ్గురు భార్యలు విడిచిపెట్టారని.. నాలుగో భార్య క్యాన్సర్‌తో చనిపోయినట్లు పేర్కొన్నారు. By B Aravind 11 Aug 2024 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి Trainee Doctor : పశ్చిమ బెంగాల్ (West Bengal) రాజధాని కోల్‌కతా (Kolkata) లో ట్రైనీ డాక్టర్‌ను హత్యాచారం చేసిన ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆసుపత్రిలో రాత్రిపూట విధుల్లో ఉన్న ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య జరిగింది. నిందితుడిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో ప్రధాన నిందితుడైన సంజయ్ రాయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కానీ అతడి తల్లి మాలతీ రాయ్ మాత్రం తన కొడుకు నిర్ధోషి అని.. పోలీసుల ఒత్తిడితోనే చేయని తప్పును ఒప్పకున్నాడని ఆరోపించింది. Also Read: నిర్మాణంలో కైగా పవర్ ప్లాంట్.. మేఘా కంపెనీ మరో విపత్తుకు దారి తీస్తుందా ? అరెస్టు చేసిన అనంతరం పోలీసులు సంజయ్ నివాసం ఉంటున్న ప్రాంతానికి వెళ్లారు. అక్కడ స్థానికులు, బంధువులతో మాట్లాడి అతడి గురించి ఆరా తీశారు. అయితే పోలీసుల విచారణలో నిందితుడు సంజయ్ రాయ్‌కు నాలుగు పెళ్లిళ్లు అయినట్లు తేలింది. అతడి దుష్ప్రవర్తన వల్లే ముగ్గురు భార్యలు విడిచిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇక నాలుగో భార్య గతేడాది క్యాన్సర్ (Cancer) తో మృతి చెందింది. నిందితుడు తరుచూ తాగిన మత్తులో అర్ధరాత్రి ఇంటికి వస్తుండేవాడని స్థానికులు తెలిపారు. ఇదిలా ఉండగా.. ట్రైనీ డాక్టర్ హత్యతో మమతా బెనర్జీ (Mamata Banerjee) సర్కార్ చర్యలకు దిగింది. ఆసుపత్రికి ఇంఛార్జిగా ఉన్న సూపరింటెండెంట్ డాక్టర్ సంజయ్ వశిష్టను పదవి నుంచి తొలగిస్తూ ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. వైద్య విద్యార్థులు, వైద్యులు నిరసనలు చేసిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. మరోవైపు హత్యాచారానికి గురైన ట్రైనీ డాక్టర్‌కు సంబంధించి పోస్టుమార్టం నివేదిక బయటకు వచ్చింది. రిపోర్టు పరిశీలిస్తే.. ఆమె కళ్లు, నోటి నుంచి బ్లీడింగ్ అయ్యింది. ముఖం, గోళ్లపై గాయాలయ్యాయి. అలాగే బాధితురాలి మెడ, కడుపు, కుడి చేయి, ఎడమ కాలు, పెదవులు, చేతి వేళ్లపై గాయాలయ్యాయి. అంతేకాదు ఆమె ప్రైవేటు అవయవం నుంచి కూడా బ్లీడింగ్ అయినట్లు పోస్టు మార్టం నివేదిక తెలిపింది. #telugu-news #national-news #west-bengal #kolkata #trainee-doctor మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి