Hyderabad: హైదరాబాద్ బాంబ్ బ్లాస్ట్ లపై కిషన్ రెడ్డి సంచలన కామెంట్స్.. అక్కడ కూర్చొని రిమోట్ నొక్కారంటూ

హైదరాబాద్ గోకుల్ చాట్, దిల్ సుఖ్ నగర్, లుంబిని పార్క్ బాంబు బ్లాస్ట్ లపై బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. గత ప్రభుత్వంలో ఉగ్రవాదులు పాకిస్థాన్ లో కూర్చొని రిమోట్ నొక్కితే ఇక్కడ బాంబులు పేలాయన్నారు. కానీ మోడీ రాకతో ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించామన్నారు.

New Update
Hyderabad: హైదరాబాద్ బాంబ్ బ్లాస్ట్ లపై కిషన్ రెడ్డి సంచలన కామెంట్స్.. అక్కడ కూర్చొని రిమోట్ నొక్కారంటూ

Kishan Reddy: హైదరాబాద్ లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ లపై కేంద్రమంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదాలు జరిగాయని, తెలంగాణలో ఐసీస్ ఏజెంట్లు విచ్చలవిడిగా ఉండేవారంటూ పరోక్షంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై (Congress Govt)  విమర్శలు గుప్పించారు. ఆదివారం బీజేపీ పార్టీ నిర్వహించిన ఓ సమావేశంలో మీడియాతో మాట్లాడిన ఆయన నరేంద్రమోడీ రాకతో దేశంలో శాంతి భద్రతలు పెరిగాయన్నారు.

మన ఖర్మ ఇంతే..
ఈ మేరకు ఉగ్రవాదులు పాకిస్థాన్ లో (Pakistan) కూర్చొని రిమోట్ నొక్కితే హైదరాబాద్ లో గోకుల్ చాట్ (Gokul Chat), దిల్ సుఖ్ నగర్, లుంబిని పార్క్ లలో మూడుచోట్ల బాంబ్ బ్లాస్ట్ (Bomb Blasts) జరిగాయన్నారు. అంతేకాదు దేశవ్యాప్తంగా ముంబై లాంటి ప్రాంతాల్లో నడుస్తున్న ట్రైన్ లలో బాంబ్ బ్లాస్ట్ లు చోటుచేసుకున్నాయని, పాకిస్థాన్ ఐఎస్ఐ వెళ్ళు పాతుకొని భారత్ ను తన గుప్పెట్లో పెట్టుకోవాలని చూసిందని ఆయన అన్నారు. 'మతకలాహాలు ప్రేరేపించి RDXలు పేల్చేవాళ్లు. Ak 47లు యధేచ్చగా భారత దేశానికి పంపించేవాళ్లు. భారత్ లో విద్వంసం సృష్టించడానికి పాకిస్థాన్ వేల కోట్లు ఖర్చు పెట్టేది. ఇండియన్ కరెన్సీని పాకిస్థాన్ లో నకిలీ కరెన్సీ గా ముద్రించి, ఒక ప్రత్యేకమైన ఆర్థిక వ్యవస్థను పాకిస్థాన్ నడిపేది. జమ్మూ కశ్మీర్ లోనే 46 వేల మంది భారతీయులు ఉగ్రవాదానికి బలయ్యారు. గతంలో పాకిస్థాన్ చంపే వాళ్లు.. మనం చచ్చే వాళ్ళం. మన ఖర్మ ఇంతే అనే పరిస్థితి ఉండేదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి : Crime: పండగపూట విషాదం.. వాకిట్లో ముగ్గేస్తున్న టీడీపీనేత కూతుళ్లపైకి దూసుకెళ్లిన లారీ

మోడీ చరిత్రను తిరగరాశారు..
అయితే ఆ పరిస్థితులు లేవని, నరేంద్ర మోడీ (Narendra Modi) వచ్చి చరిత్రను తిరగ రాశారని ప్రధానిపై ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు భారత్ లో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని, మోడీ ప్రధాని అయ్యాక ఈ పదేళ్లలో మతకలాలు లేవు, కర్ఫ్యూ లు లేవు, AK 47లు లేవు, RDXలు లేవన్న కిషన్ రెడ్డి.. ఈ పదేళ్లలో సమూలంగా కూకట్ వేళ్లతో ఉగ్రవాదాన్ని పెకలించడం జరిగిందన్నారు.

రొట్టె ముక్క కోసం కోట్లాట..
ఇక పాకిస్థాన్ ఆర్థిక స్థితిగతుల గురించి మాట్లాడుతూ.. ఇవాళ పాకిస్థాన్ లో ప్రజలు రొట్టె ముక్క కోసం కోట్లాడుకునే పరిస్థితులు ఏర్పడ్డాయని, నరేంద్ర మోడీ సారథ్యంలో ప్రపంచంలో పాకిస్థాన్ ను ఏకాకిగా నిలబెట్టిందని చెప్పారు. అలాగే పాకిస్థాన్ గత పాపాలను ఇప్పుడు అనుభవిస్తుందన్న కేంద్రమంత్రి.. వారికి వారే చంపుకు చస్తున్నారు. పాపం పండితే ఇలాంటి పరిస్థితులే దాపరిస్తాయి. మీరు చంపితే చచ్చే వాళ్ళం కాదు. మీరు ఒక్కరినీ చంపితే మేము పది మందిని చంపుతామని పాకిస్థాన్ ను హెచ్చరించారు. పాకిస్థాన్ భూభాగంలోకి వెళ్లి సర్జికల్ స్ట్రైక్ ద్వారా పాకిస్థాన్ ఉగ్రవాదులను అంతం చేసి ప్రపంచానికి భారత్ సత్తా ఏంటో చూపించామన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు